రంగ‌స్థ‌లం.. నిజంగా ర‌ణ‌స్థ‌ల‌మే..!

Rangasthalam
రంగ‌స్థ‌లం కాదు ఇది ర‌ణస్థ‌లం అంటూ ట్రైల‌ర్ లో ప్ర‌కాశ్ రాజ్ ఓ డైలాగ్ చెప్పాడు. అది క‌చ్చితంగా సూట్ అవుతుంది ఇప్పుడు సినిమాకు. ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత రంగ‌స్థ‌లంపై అంచ‌నాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. మార్చ్ 30న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ట్రైల‌ర్ లోనే కావాల్సినంత క‌థ చెప్పేసాడు సుకుమార్. ఓ ఊరు.. అందులో చిట్టిబాబు.. అత‌డి ప్రేయ‌సి రామ‌ల‌క్ష్మి.. చిట్టిబాబు అన్న కుమార్ బాబు.. ప్రెసిడెంట్.. రంగ‌మ్మ‌త్త‌.. ఈ పాత్ర‌ల చుట్టూ తిరిగే క‌థే రంగ‌స్థ‌లం. గ్రామ రాజ‌కీయాల చుట్టూ ఈ క‌థ తిరుగుతుంది. ముఖ్యంగా పాలిటిక్స్ పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసాడు సుకుమార్. ఇన్నాళ్లూ మ‌నం చూసిన రెగ్యుల‌ర్ మాస్ మ‌సాలా సినిమాల‌కు క‌చ్చితంగా భిన్నంగా ఉంది రంగ‌స్థ‌లం. ఈ చిత్రం చ‌ర‌ణ్ కెరీర్ లోనే ప‌ర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా ది బెస్ట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. చ‌ర‌ణ్ కూడా త‌న‌కు రంగ‌స్థ‌లం చేసిన త‌ర్వాత త‌న మీద త‌న‌కే గౌర‌వం పెరిగింద‌ని చెబుతున్నాడు. మొత్తానికి ఈ రంగ‌స్థ‌లం ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో మ‌రో ప‌దిహేను రోజుల్లో తేల‌బోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here