సుమంత్ లో ఆ జోష్ క‌నిపిస్తుందిగా..!

ఒక్క సినిమా చాలు.. మ‌రిచిపోయిన హీరోను మ‌ళ్లీ గుర్తు చేయ‌డానికి..! గ‌తేడాది సుమంత్ విష‌యంలో ఇదే జ‌రిగింది. అప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ మ‌రిచిపోయిన సుమంత్ ను మ‌ళ్లీరావా మ‌ళ్లీ గుర్తు చేసింది. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం సాధించ‌లేదు కానీ సుమంత్ అనే ఓ హీరో ఉన్నాడ‌నే విష‌యం మాత్రం గుర్తు చేసింది. గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

ఇక ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు నానితో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మ‌ళ్లీ రావా ఇచ్చిన స్పూర్థితో ఇప్పుడు మ‌రో సినిమా చేస్తున్నాడు సుమంత్. ఈ చిత్రానికి ఇదం జ‌గ‌త్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఇందులో సుమంత్ కాస్త నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. కొత్త ద‌ర్శ‌కుడు అనిల్ శ్రీ‌కంఠం తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. సినిమాను జులై చివ‌ర్లో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఈ సినిమా ఇలా ఉండ‌గానే తాజాగా మ‌రో సినిమాతోనూ వ‌చ్చేస్తున్నాడు సుమంత్. పైగా ఇది ఆయ‌న‌కు 25వ సినిమా కావ‌డం మ‌రో విశేషం. సంతోష్ జాగ‌ర్ల‌పూడి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రానికి సుబ్ర‌మ‌ణ్య‌పురం టైటిల్ ఫిక్స్ చేసారు. చూస్తుంటే ఇది కార్తికేయ‌కు కాపీలా అనిపిస్తుంది. ఈ రెండు సినిమాల‌తో త‌న కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుంద‌ని భావిస్తున్నాడు సుమంత్. మ‌రి చూడాలిక‌.. ఈ అక్కినేని అల్లుడికి ఈ రెండు సినిమాలు ఎంత‌వ‌ర‌కు హెల్ప్ చేస్తాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here