షాక్.. విశ్వ‌రూపం 2 సెన్సార్ పూర్తి..

Kamal Haasan controversial comments on Hindu terrorism

అవును.. ఇప్పుడు విశ్వ‌రూపం 2 కు సంబంధించిన ఏ విష‌య‌మైనా షాకింగే. ఒక‌టి రెండు కాదు నాలుగేళ్లుగా మూల‌న ప‌డ్డ సినిమా అది. క‌మ‌ల్ హాస‌న్ తో పాటు అంతా మ‌రిచిపోయిన సినిమా ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుందంటే అంద‌రికీ షాకే మ‌రి. క‌మ‌ల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్లు దాటేసింది. కొన్ని వంద‌ల సినిమాలు చేసాడు కానీ ఏ రోజు ఒక్క సినిమా కోసం ఇంత‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. కానీ ఏం చేస్తాం..

ఒక్కోసారి ద‌రిద్ర దేవ‌త నెత్తిమీద డాన్సులు చేస్తుంటుంది. విశ్వ‌రూపం సినిమా విష‌యంలో క‌మ‌ల్ త‌ల‌పై ద‌రిద్ర దేవ‌త కాదు.. దేవ‌త‌లే డాన్సులు కాదు.. ఏకంగా క‌చేరీలు పెట్టారు. ఇన్నాళ్ల‌కు ఆ క‌చేరీ పూర్త‌యింది. 2013లో విశ్వ‌రూపం చేసాడు. ఇది వ‌చ్చిన ఆర్నెళ్ల‌కే సీక్వెల్ కూడా విడుద‌ల చేయాల‌నుకున్నాడు క‌మ‌ల్. కానీ 2018 వ‌చ్చినా విశ్వ‌రూపం 2 మాత్రం రాలేదు. ఈ సినిమాకు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు కూడా క‌మ‌ల్ హాస‌నే. ఈ సినిమాతో ఆస్తుల్ని కూడా పోగొట్టుకున్నాడు క‌మ‌ల్.

ఇంత చుక్క‌లు చూపించినా విశ్వ‌రూపం అంటే క‌మ‌ల్ కు చాలా ఇష్టం. అందుకే విశ్వ‌రూపం 2 కూడా సిద్ధం చేసాడు ఈ హీరో. ఈ సినిమా షూటింగ్ ఆ మ‌ధ్య పూర్తి చేసాడు క‌మ‌ల్. ఈ సినిమా త‌ర్వాత పాప‌నాశం, చీక‌టిరాజ్యం, ఉత్త‌మ‌విల‌న్ సినిమాలు చేసాడు క‌మ‌ల్. కానీ విశ్వ‌రూపం 2కి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మోక్షం రాలేదు. ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందో కూడా క్లారిటీ లేదు. విశ్వ‌రూపం హిట్ అనిపించుకున్నా.. క‌మ‌ల్ కు మిగిలిందేమీ లేదు. ఈ సినిమాతో న‌ష్టాలే వ‌చ్చాయి ఈ హీరోకి. దాంతో విశ్వ‌రూపం 2ని ఆస్కార్ ర‌విచంద్ర‌న్ నిర్మించాడు. కానీ మ‌ధ్య‌లో ఈ నిర్మాత కూడా చేతులెత్తేసాడు. ఆ త‌ర్వాత అగ‌మ్య‌గోచ‌రంగా మారిన విశ్వ‌రూపం 2ను క‌మ‌ల్ ముందుకొచ్చి నెత్తినేసుకున్నాడు. ఆ మ‌ధ్య ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.

ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ విశ్వ‌రూపం చూపించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు క‌మ‌ల్ హాస‌న్. ఇండియ‌న్ జెండాతో ఉన్న విశ్వ‌రూపం 2 ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే ఈ సారి క‌చ్చితంగా సెంటిమెంట్ తో కొట్ట‌బోతున్నాడు క‌మ‌ల్. ఈ మ‌ధ్యే విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్ కమింగ్ సూన్ అంటూ మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసారు క‌మ‌ల్ హాస‌న్. దానికితోడు ఇప్పుడు మ‌రో సాక్షం కూడా వ‌చ్చింది. ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తైపోయింది. యు బై ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది బోర్డ్. ప్ర‌స్తుతం త‌మిళ‌నాట స్ట్రైక్ న‌డుస్తున్న నేప‌థ్యంలో అది ఆగిన త‌ర్వాత ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. గ‌తంలో ముర‌ద‌నాయ‌గం, మ‌ర్మ‌యోగి లాంటి సినిమాల్ని మొద‌లుపెట్టి ఆపేసిన క‌మ‌ల్.. విశ్వ‌రూపం 2కి ఆ గ‌తి రాకూడ‌ద‌ని ఫిక్స‌య్యాడు. అందుకే కాస్త ఆల‌స్య‌మైనా బాక్సుల్లోంచి ఆ సినిమాను బ‌య‌టికి తీసుకొస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here