విష్ణు మంచు – జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ విడుదల !

Achari America Yatra Teaser is a fun ride!
విష్ణు మంచు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర టీజర్ విడుదలైనది. కామెడీ ప్రధానంగా సాగే టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ లో వస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరిరువురు ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’ వంటి చిత్రాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే. ఇక జి.నాగేశ్వర్ రెడ్డి కలయికలో విష్ణు ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించారు. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోదాన్ని అందించనుంది నిర్మాతలు ధీమా వ్యక్తపరిచారు.
విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్నకి  ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రాన్ని జనవరి 26 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు ‘పద్మజ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు.
ఇతర తారాగణం:
తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ  రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావా, ఠాకూర్ అనూప్ సింగ్, సురేఖ వాణి
సాంకేతిక వర్గం:
రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి
ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్
ఎడిటింగ్: వర్మ
సంగీతం: ఎస్ ఎస్ థమన్
మాటలు: డార్లింగ్  స్వామి
ఆర్ట్ : కిరణ్
యాక్షన్ : కనాల్ కన్నన్
బ్యానర్ : పద్మజ  పిక్చర్స్
సమర్పించు :  ఎం ఎల్ కుమార్  చౌదరి
నిర్మాతలు: కీర్తి  చౌదరి , కిట్టు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జి నాగేశ్వర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *