ఫిబ్ర‌వ‌రి 9.. ఏంటి ఎవ‌రూ త‌గ్గ‌రా అస‌లు..? 

Nikhil’s ‘Kirrak Party’ Is Set For Grand Release On February 9th, 2018

ఉన్న‌ది ఒక‌టే జింద‌గీలా.. ఇప్పుడు మ‌న హీరోలంతా ఉన్న‌ది ఒక్క‌టే డేట్ అనే కొత్త సినిమా ఒక‌టి తీస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా..? ఆ డౌట్ వ‌చ్చిన వాళ్లు ఫిబ్ర‌వ‌రి 9 వైపు చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ తేదీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ రోజు ఐదు సినిమాలు విడుద‌ల కానున్నాయి. పోనీ అవ‌న్నీ చిన్న సినిమాలా అంటే ఏమో అనుకోవ‌చ్చు. విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌వ‌న్నీ గుర్తింపు ఉన్న పెద్ద సినిమాలే. అన్నీ ఒకేరోజు వ‌స్తే క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ఉంటుంది. అయినా గానీ ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. ఫిబ్ర‌వ‌రి 9న అంద‌రికంటే ముందు త‌న సినిమా విడుద‌ల తేదీని ఫిక్స్ చేసుకున్నాడు వ‌రుణ్ తేజ్. ఈయ‌న న‌టిస్తున్న తొలిప్రేమ విడుద‌ల కానుంది. వెంకీ అట్లూరి తెర‌కెక్కి స్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. రాశీఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంది.
ఫిబ్ర‌వ‌రి 9నే తాను ఉన్నానంటూ వ‌స్తున్నాడు నిఖిల్. కిరాక్ పార్టీ చేసుకోడానికి వ‌స్తున్నాడు ఈ కుర్ర హీరో. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ కిరాక్ పార్టీకి రీమేక్. ఇప్పుడు నిఖిల్ సినిమాల‌కు 20 కోట్ల మార్కెట్ వ‌చ్చింది. అంటే ఈ సినిమాపై కూడా అంచ‌నాలు భారీగా ఉన్న‌ట్లే. ఇక మోహ‌న్ బాబు గాయ‌త్రి కూడా అదే రోజు రానున్న‌ట్లు పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. సాయిప‌ల్ల‌వి క‌ణం సినిమా కూడా ఫిబ్రవ‌రి 9నే విడుద‌ల కానుంది. ఈ మేర‌కు రిలీజ్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించారు. ఇక వీళ్ల‌కు తోడు ఇప్పుడు సాయిధ‌రంతేజ్-వినాయ‌క్ సినిమా ఇంట‌లిజెంట్ కూడా ఇదే రోజు రానుందని చెబుతున్నాడు నిర్మాత సి క‌ళ్యాణ్. ఇలా ఒకేరోజు ఐదు చిత్రాలు వ‌స్తే క‌చ్చితంగా ఎవ‌రికీ లాభం ఉండ‌దు. చివ‌రి వ‌ర‌కు ఎవ‌రెవ‌రు రేస్ లో ఉంటారో.. ఎవ‌రు త‌ప్పుకుంటారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here