ట‌చ్ చేసి చూడు రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 2
Total Critics:9

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 2.00 out of 5)
Loading...
movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

Touch Chesi Chudu – Watch at your own risk!
Rating: 1.5/5

www.teluguodu.com

Touch Chesi Chudu – Routine Touch
Rating: 2.75/5

www.123telugu.com

'Touch Chesi Chudu' is a deadly combination of an outdated story and insipid heroism.
Rating: 2.25/5

www.indiaglitz.com

Touch me not
Rating: 2.5/5

www.gulte.com

Boring to the core !
Rating: 2/5

www.telugu360.com

Touch Chesi Chudu is another commercial entertainer from Mass Maharaj Ravi Teja
Rating: 2.5/5

www.chitramala.com

Don't touch it! Stay away
Rating: 2.25/5

www.cinejosh.com

Better not to touch
Rating: 1.25/5

www.andhraheadlines.com

Touch chesi chudu for B & C
Rating: 2.5/5

www.thehansindia.com

న‌టీన‌టులు: ర‌వితేజ‌, రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్, ముర‌ళి శ‌ర్మ‌..
నిర్మాత‌లు: వ‌ల్ల‌భ‌నేని వంశీ, న‌ల్ల‌మ‌లుపు బుజ్జి
క‌థ‌: వ‌క్కంతం వంశీ
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: విక్ర‌మ్ సిరికొండ‌

రాజా ది గ్రేట్ లాంటి సినిమా త‌ర్వాత ర‌వితేజ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ట‌చ్ చేసి చూడుపై ముందు నుంచి అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని ర‌వితేజ కూడా బ‌లంగా న‌మ్ముతున్నాడు. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కాన్ని సినిమా ఎంత వ‌ర‌కు నిల‌బెట్టింది..?

కథ‌:
కార్తికేయ‌(ర‌వితేజ‌) ప‌క్కా ఫ్యామిలీ ప‌ర్స‌న్. పాండిచ్చేరిలో ఓ కార్ షెడ్ న‌డుపుతుంటాడు. కుటుంబం త‌ప్ప మ‌రో ప్ర‌పంచ‌మే తెలియ‌దు కార్తికేయ‌కు. అలాంటి కార్తికేయ‌కు పుష్ప‌(రాశీఖ‌న్నా)తో పెళ్లిచూపులు జ‌రుగుతాయి. ముందు ఒప్పుకోక‌పోయినా వెంట‌బ‌డి మ‌రీ ఒప్పిస్తాడు కార్తికేయ‌. కానీ కార్తిక్ లైఫ్ లో పుష్ప కంటే ముందే మ‌రో అమ్మాయి (సీర‌త్ క‌పూర్) ఉంటుంది. కార్తికేయ జీవితం అంతా సాఫీగా సాగిపోతున్న స‌మ‌యంలో అత‌డి జీవితంలో అనుకోని సంఘ‌ట‌న జ‌రుగుతుంది. ఓ స్టూడెంట్ లీడ‌ర్ హ‌త్య కార్తికేయ చెల్లెలు చూస్తుంది. ఆ హ‌త్యకు సంబంధించిన వివరాల‌న్నీ పోలీసుల‌కు త‌న చెల్లి గురించి తెలియ‌కుండా ఇప్పిస్తాడు కార్తికేయ‌. తీరా చూస్తే ఆ హంత‌కుడికి కార్తికేయ గ‌తంతో బ‌ల‌మైన శ‌త్రుత్వం ఉంటుంది. అస‌లు వాళ్ల క‌థేంటి.. ఏసిపిగా ఉన్న కార్తికేయ ఎందుకు పాండిచ్చేరిలో కామ్ గా బ‌తుకుతుంటాడు.. అనేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం:
కొన్నిసార్లు టైటిల్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంటాయి. ట‌చ్ చేసి చూడు కూడా అంతే. ఈ టైటిల్ తోనే సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. కానీ టైటిల్ విష‌యంలో తీసుకున్న జాగ్ర‌త్త క‌థ విష‌యంలో తీసుకోలేదు ర‌వితేజ‌. మ‌రోసారి పాత క‌థ‌నే న‌మ్మి అడ్డంగా మునిగిపోయాడు. ఇప్ప‌టికే ఎన్నో సినిమాల్లో వాడేసిన క‌థ‌నే మ‌రోసారి రాసుకొచ్చాడు వక్కంతం వంశీ. అస‌లే రొటీన్ క‌థ అనుకుంటే.. దాన్ని అంత‌కంటే రొటీన్ గా తెర‌కెక్కించాడు విక్ర‌మ్ సిరికొండ‌. ర‌వితేజ లాంటి హీరో ఉన్న త‌ర్వాత కూడా ఆయ‌న్ని స‌రిగ్గా వాడుకోలేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. వ‌క్కంతం వంశీ ఇప్ప‌టికే ఎన్నో సినిమాల్లో వాడేసిన క‌థ‌ను మ‌రోసారి ఇచ్చాడు. పోలీస్ అజ్ఞాతంలో ఉండ‌టం.. ఆయ‌న‌కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండ‌టం.. ఇంట‌ర్వెల్ టైమ్ కు మ‌ళ్లీ బ‌య‌టికి రావ‌డం.. ఇవ‌న్నీ క‌లిపితే ట‌చ్ చేసి చూడు క‌థ‌. ఫ‌స్టాఫ్ అంతా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. అయితే అందులోనూ కొన్ని విసుగు తెప్పించే సీన్స్ కూడా ఉన్నాయి.
రాశీఖ‌న్నా, ర‌వితేజ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ మ‌రీ రొటీన్ గా ఉన్నాయి. వీళ్ళ ల‌వ్ సీన్స్ పెద్ద‌గా పండ‌లేదు. ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఊహించ‌ద‌గ్గ‌దే ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. పోలీస్ ఆఫీస‌ర్ గా ఏం చేస్తాడో అని ఊహించిన వాళ్ల‌కు నిరాశే మిగులుతుంది. ఒక్క ఎన్నిక‌ల ప్ర‌చారం సీన్ మాత్రం బాగా డిజైన్ చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అందులో ర‌వితేజ ఎన‌ర్జీ అదిరిపోయింది. ఆ త‌ర్వాత మాత్రం అదే టెంపో కొన‌సాగ‌లేదు క‌థ‌లో. సీర‌త్ క‌పూర్ తో వ‌చ్చే సీన్స్ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌లేదు. ఓ అమ్మాయి హ‌త్య కేస్ నే సినిమా అంతా సాగ‌దీసిన‌ట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా తేల్చేసాడు ద‌ర్శ‌కుడు.

న‌టీన‌టులు:
ర‌వితేజ న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ప‌ర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు మాస్ రాజా. కాక‌పోతే ఆయ‌న‌కు క‌థ స‌హ‌క‌రించ‌లేదు. రాశీఖ‌న్నా అందాల ఆర‌బోత‌కే స‌రిపోయింది. కొన్ని చోట్ల క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో ఆక‌ట్టుకుంది. సీర‌త్ క‌పూర్ గ్లామ‌ర్ షో కు త‌ప్ప పెద్ద‌గా గుర్తించుకోవాల్సిన కారెక్ట‌ర్ కాదు. సుహాసిని ఒక్క సీన్ లో క‌నిపించినా క‌థ‌ను ముందుకు న‌డిపించే పాత్ర ఇది. ముర‌ళి శ‌ర్మ డిజిపిగా బాగా చేసాడు. స‌త్యం రాజేష్, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. మిగిలిన వాళ్ళంతా జ‌స్ట్ ఓకే.

టెక్నిక‌ల్ టీం:
ప్రీత‌మ్ పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. బాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయినా తెలుగులో మాత్రం ఆ తేడా క‌నిపించింది. ఇక మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎమోష‌న‌ల్ సీన్స్ లో మ‌రోసారి త‌న మ్యాజిక్ చూపించాడు మ‌ణి. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఇందులో చెప్పుకునేంత అద్భుత‌మైన లొకేష‌న్లు కూడా ఏం లేవు. ఇక వ‌క్కంతం వంశీ క‌థ చాలా సినిమాల్లో చూసిందే. బాషా రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి.. ఇంట‌ర్వెల్ టైమ్ కు దాన్ని రివీల్ చేయ‌డ‌మే. పాపం విక్ర‌మ్ సిరికొండ‌కు ఈ క‌థ‌కు చేయాల్సిందంతా చేసాడు. కానీ ద‌ర్శ‌కుడిగా తాను డెబ్యూ చేసిన సినిమా మాత్రం ఊహించిన రేంజ్ లో లేదు.

చివ‌ర‌గా:
ట‌చ్చింగులు చాలా క‌ష్టం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here