చ‌ర‌ణ్-కొర‌టాల‌.. మ‌ళ్లీ బిస్కెట్టేనా..?

Ram Charan Boyapati

అవును.. ఇప్పుడు సీన్ చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. ఆవేశంలో ల‌క్ష చెబుతాం అన్నీ చేస్తామా ఏంటి అన్న‌ట్లుంది ఇప్పుడు య‌వ్వారం. లేక‌పోతే మ‌రేంటి.. రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోతో రెండు సార్లు సినిమా అనౌన్స్ చేసి కూడా కామ్ గా ఉన్నాడు కొర‌టాల‌. మ‌రోవైపు ఇందులో కొర‌టాల‌తో పాటు చ‌ర‌ణ్ త‌ప్పు కూడా ఉంది. కొర‌టాల శివ‌తో చ‌ర‌ణ్ సినిమా అనౌన్స్ ఆర్నెళ్లు దాటేసింది. ఘాజీ సినిమాను నిర్మించిన మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌తో క‌లిసి కొణిదెల బ్యాన‌ర్ లోనే ఈ చిత్రం ఉంటుంద‌ని చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. అంతేకాదు.. 2018 స‌మ్మ‌ర్ లో ఈ సినిమా షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని అప్ప‌ట్లో చెప్పాడు చ‌ర‌ణ్. కానీ ఇప్పుడు ఈ విష‌యాన్ని ఇటు చ‌ర‌ణ్.. అటు కొర‌టాల ఇద్ద‌రూ మ‌రిచిపోయారు. సీన్ చూస్తుంటే మ‌రో ఏడాది వ‌ర‌కు కూడా ఈ సినిమా ప‌ట్టాలెక్క‌దు.
నిజానికి మిర్చి త‌ర్వాత కొర‌టాల‌తో చ‌ర‌ణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ముహూర్తం కూడా పెట్టారు. దీనికి బండ్ల‌గ‌ణేష్ నిర్మాత‌. కానీ క‌థ కుద‌ర‌క ఆగిపోయింది. అయితే సినిమా ఆగిపోయినా.. త‌ర్వాత క‌చ్చితంగా చ‌ర‌ణ్ తో సినిమా చేస్తాన‌ని ఈ మ‌ధ్యే చెప్పిన కొర‌టాల‌.. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. ప్ర‌స్తుతం మ‌హేశ్ భ‌ర‌త్ అనే నేనుతో బిజీగా ఉన్న కొర‌టాల‌.. త‌ర్వాత ఏం చేయ‌బోతున్నాడో క్లారిటీ లేదు. మ‌రోవైపు చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సుకుమార్ రంగ‌స్థ‌లంతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర్వాత బోయ‌పాటి సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. అక్టోబ‌ర్ నుంచి రాజ‌మౌళితో బిజీ. ఇలా మ‌రో ఏడాదిన్న‌ర వ‌ర‌కు చ‌ర‌ణ్ అస్స‌లు దొర‌క‌డు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు కొర‌టాల అయితే ఈయ‌న కోసం వేచి చూడ‌డుగా..! అంటే రెండోసారి కూడా ఈ కాంబినేష‌న్ బిస్కెట్ అవుతుంద‌నేగా దీన‌ర్థం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here