ఓపిక ప‌ట్టండి అంటున్న సాయిధ‌రంతేజ్..

ఇండ‌స్ట్రీలో ఓ సినిమా రూపొందుతుందంటే దానిపై వ‌చ్చే వార్త‌ల కంటే గాసిప్సే ఎక్కువ‌గా ఉంటాయి. తెలిసింది తెలియంది అన్నీ క‌లిపి వెబ్ సైట్ల‌లో వ‌చ్చేస్తుంటాయి. ఈ మ‌ధ్య కాలంలో సాయిధ‌రంతేజ్ సినిమాపై ఇది చాలానే వ‌చ్చాయి. క‌రుణాక‌ర‌ణ్ తో ఈయ‌న చేస్తోన్న సినిమాపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌చ్చింది.

ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ స‌గానికి పైగా పూర్తైంది కూడా. కానీ ఈ సినిమా టైటిల్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ‌ర్మ్ కాలేదు. రోజుకో టైటిల్ వినిపిస్తుంది కానీ ఏదీ క‌న్ఫ‌ర్మ్ కాలేదు. రెండేళ్ల కింద‌ నితిన్ చిన్న‌దాన నీ కోసం ఫ్లాపైన త‌ర్వాత క‌రుణాక‌ర‌ణ్ డిమాండ్ బాగా ప‌డిపోయింది. ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా తొలిప్రేమ ద‌ర్శ‌కుడు అనే ముద్ర ఇప్ప‌టికీ క‌రుణాక‌ర‌ణ్ ను కాపాడుతుంది. అందుకే ఇప్ప‌టికీ మ‌న హీరోలు అప్పుడ‌ప్పుడూ న‌మ్ముతున్నారు.

సాయిధ‌రంతేజ్ హీరోగా ఈయ‌న తెర‌కెక్కిస్తోన్న సినిమాకు చాలా టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. ఓ సారి దేవుడు వ‌ర‌మందిస్తే అని.. మ‌రోసారి నా మ‌న‌సే అని.. ఇంకోసారి తేజ్.. ఐ ల‌వ్ యు అని వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏమో తేజ్ ది కూడా మంచి ప్రేమ‌క‌థ అనే టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే ఇవేవీ కాద‌ని.. ఈ చిత్ర టైటిల్ ఎప్రిల్ 28న తామే అనౌన్స్ చేస్తామ‌ని పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈ చిత్రంతోనైనా సాయి ఫామ్ లోకి వ‌స్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here