ఎరుపులో అరిపించేసిందిగా..!

ఇప్పుడు ఐశ్వ‌ర్యారాయ్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది క‌దా..! నిజంగా ఈ భామ‌కు 44 ఏళ్లంటే న‌మ్మ‌డం సాధ్య‌మేనా..? అస‌లు 40 దాటితే ఆంటీ అనాల‌ని ఎవ‌డు క‌నిపెట్టాడో కానీ వాడికి ఐష్ ను ఒక్క‌సారి చూపించాలి. ఇక వాడు మ‌ళ్లీ చ‌చ్చినా ఆంటీ అన‌డేమో..? ఎందుకంటే ఆంటీ ప‌దానికి పూర్తిగా యాంటీ ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా అమ్మాయిగారు అదిరిపోయే ఫోటోషూట్ తో మ‌తులు పోగొట్టేసారు. పెళ్లైతే ఏంటి.. త‌ల్లైతే ఏంటి.. స్క్రిప్ట్ డిమాండ్ చేయాలే గానీ తాను రెచ్చిపోడానికి రెడీగా ఉన్నానంటోంది ఐశ్వ‌ర్యారాయ్. అస‌లు ఈ భామ ఇంత‌గా హాట్ నెస్ పెంచేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు కూడా. మొన్న‌ ఏ దిల్ హై ముష్కిల్ లో త‌న‌కంటే తొమ్మిదేళ్లు చిన్న‌వాడైన ర‌ణ్ బీర్ క‌పూర్ తో ఐష్ చేసిన‌ రొమాన్స్ చూస్తుంటే క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు.
ఏ దిల్ హై ముష్కిల్ కోసం చాలానే చేసిన ఐష్.. ఇప్పుడు దానికి సీక్వెల్ చేస్తోంది. అంటే కొంప‌దీసి సినిమాకు సీక్వెల్ వ‌స్తుంది అనుకోకండి. హాట్ షోకు సీక్వెల్ వ‌స్తుంద‌న్న‌మాట‌. తాజాగా వోగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఐష్. అదిరిపోయే క్లీవేజ్ షో కు తోడు.. హాట్ హాట్ థైస్ ను వ‌డ్డింపుకు పెట్టింది ఐశ్వర్యారాయ్. ముఖ్యంగా ఎరుపు డ్ర‌స్ లో ఆమె అరిపించిన తీరు చూసి కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌దేమో..? ఆ స్థాయిలో రెచ్చిపోయింది అందాల ఐష్. ఇది చూసిన త‌ర్వాత కూడా నిజంగానే ఆమెకు 44 ఏళ్లు ఉన్నాయా.. లేదంటే బ్ర‌హ్మ‌దేవుడు ఏదైనా ఆమెకి మాత్ర‌మే వ‌యసును దాచేసే యంత్రాన్ని ఇచ్చాడా అనిపిస్తుంది. మొత్తానికి ఈ భామ‌ను ఇలా చూస్తుంటే కుర్రాళ్ల‌కు మ‌తులు చెడిపోవ‌డం మాత్రం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here