అబ్బా అను.. చంపేసావే న‌న్ను..

ఈ ఫోటోలు చూసిన త‌ర్వాత ప్ర‌తీ ఒక్క‌రు ఇదే అనుకుంటారేమో..? ఆ చూపుల‌తోనే చంపేస్తుంది అంద‌ర్నీ. ఈ సోగ‌క‌ళ్ల సొగ‌స‌రి సైగ‌ల‌కు కుర్రాళ్ళంతా మ‌తులు చెడిపోయి చూస్తున్నారు. మ‌జ్నుతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన ఈ మ‌ళ‌యాలి ముద్దుగుమ్మ ఇండ‌స్ట్రీలో అస్తిత్వం కోసం పోరాడుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసిలో న‌టించినా కూడా అమ్మాయిగారికి పెద్ద‌గా హెల్ప్ కాలేదు. గోపీచంద్ ఆక్సీజ‌న్ కూడా డిజాస్ట‌రే. ఇప్పుడు బ‌న్నీ నా పేరు సూర్య, మారుతి-నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది అను ఎమ్మాన్యువ‌ల్. మ‌జ్నులో ప‌ద్ద‌తిగా క‌నిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే అందాల బాణాలు వ‌దిలేస్తుంది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు ఫోటోషూట్ల‌లో రెచ్చిపోతుంది ఈ కేర‌ళ‌కుట్టి. తాజాగా అమ్మాయి గారు ఓ ఫోటోషూట్ లో చూపుల‌తోనే చంపేస్తున్నారు. ట్రెడీషిన‌ల్ లుక్ తో పాటు త‌న‌లో ఈ మోడ్ర‌న్ యాంగిల్ కూడా ఉంద‌ని ద‌ర్శ‌కుల‌కు హింటిస్తుంది అను ఎమ్మాన్యువ‌ల్. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల‌న్నీ హిట్టైతే.. ఇలా అందాల ఆర‌బోత ప‌రిచేస్తే.. అమ్మో అను ఎమ్మాన్యువ‌ల్ కు ఇంత ఎదురు ఉంటుందా..? పైగా మెగా కంపౌండ్ లోకి కూడా ఎంట‌రైపోయింది. ఆ చ‌లువుతోనైనా ఇప్పుడు అవ‌కాశాలు వ‌స్తాయో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here