వినాయ‌క్ థియేట‌ర్స్ ను అమ్మేసాడా.. వ‌దిలేసాడా..?

దర్శకుడు వివి వినాయక్ థియేటర్ ను ఎందుకు అమ్మాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న హాట్ టాపిక్ ఇదే. ఈయనకు థియేటర్లు అంటే చాలా మోజు. అందుకే దర్శకుడిగా తాను బాగా సంపాదిస్తున్న రోజుల్లోనే విశాఖలోని రెండు మూడు థియేటర్స్ ను కొని వారికి v max అనే నామకరణం చేశాడు.

VV Vinayak Sold Out His Vizag Theatres

అందులోనే మల్టీప్లెక్స్ నిర్మించాడు ఈ దర్శకుడు. అప్పట్నుంచీ ప్రతి పెద్ద సినిమాను కొనుగోలు చేస్తూ డిస్ట్రిబ్యూష‌న్ కూడా చేస్తున్నాడు వినాయ‌క్. ఈ మ‌ల్టీప్లెక్సులకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ ఆయ‌న తమ్ముడు విజయ్ చూసుకునేవాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి థియేటర్లను వినాయక్ అమ్మేసాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీని వెనక ఏదో పెద్ద కథే ఉంది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వినాయ‌క్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు.

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా కూడా అది చిరు మేనియాలోకి వెళ్లిపోయింది. ఈయన తెరకెక్కించిన అఖిల్.. అల్లుడు శీను.. ఇంటలిజెంట్ సినిమాలుగా ఫ్లాపులుగా నిలిచాయి. దాంతో వినాయక్ కు ఆఫర్ ఇవ్వడానికి ఇప్పుడు ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీ ప‌డిన హీరోలు కూడా ఇప్పుడు ఆయన కనిపిస్తే తప్పించుకుని తిరుగుతున్నారు.

దాంతో త‌న‌కు ఏం చేయాలో అర్థం కావడంలేదు. పైగా బాలయ్య తో కమిట్ అయిన సినిమా కూడా ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు. ఆర్థిక సమస్యలతోనే థియేటర్స్ అమ్మాడా లేదంటే మంచి రేటు వచ్చిందని తీసేసాడా అనే వాదన ఇప్పుడు ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తుంది. దీనికి వినాయ‌క్ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి మరి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here