మాస్ సాంగ్ తో వ‌చ్చిన చ‌ర‌ణ్.. కైపెక్కించిన కైరా..

బోయ‌పాటి శీను అంటేనే మాస్.. ఆయ‌న లాంటి ద‌ర్శ‌కుడికి చ‌ర‌ణ్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో దొరికితే వ‌చ్చే ఔట్ పుట్ ర‌చ్చే ఇంక‌. ఇప్పుడు విన‌య విధేయ రామ విష‌యంలో ఇదే జ‌రుగుతుందేమో అనిపిస్తుంది. టీజ‌ర్ చూసిన త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఎలాంటి సినిమా అయితే ఫ్యాన్స్ ఊహించారో అలాంటి సినిమానే ఇస్తున్నాడ‌ని అర్థ‌మైపోయింది. ఆ త‌ర్వాత వెంట‌నే రూట్ మార్చేసాడు బోయ‌పాటి.

Vinaya Vidheya Rama Second Song Review

ఇందులో యాక్ష‌న్ మాత్ర‌మే ఉంటుందేమో అనుకునే వాళ్ల‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ఉన్నాయ‌ని నిరూపించేలా తొలిపాట తందానే తందానే విడుద‌ల చేసాడు. తందానే తందానే.. ఎక్క‌డైనా చూసారా ఇంతానందాన్నే అంటూ శ్రీ‌మ‌ణి రాసిన పాట‌ను ఎమ్ఎల్ఆర్ కార్తికేయ‌న్ పాడాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ పాట‌ను చూసిన త‌ర్వాత సినిమాలో ఎమోష‌న్ ఎలా ఉండ‌బోతుందో కూడా క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు ప‌క్కా మాస్ బీట్ ఒక‌టి విడుద‌ల చేసాడు బోయ‌పాటి శీను. ఈ సారి దేవీ శ్రీ ప్ర‌సాద్ త‌న డ్ర‌మ్స్ కు బాగానే ప‌ని చెప్పాడు. పాట బాగానే ఉన్నా కూడా ట్యూన్ మాత్రం ఎక్క‌డో విన్న‌ట్టే అనిపిస్తుంది.

కాక‌పోతే దేవీ పాట‌లు ఎలాగూ స్లో పాయిజ‌న్ కాబ‌ట్టి క‌చ్చితంగా విడుద‌ల టైమ్ వ‌ర‌కు ఎక్కుతుంద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రాన్ని గ్యాంగ్ లీడ‌ర్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నాడ‌నే వార్త‌లు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇందులో చ‌ర‌ణ్ అన్న‌య్య‌లుగా ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్ న‌టిస్తున్నారు. విన‌య విధేయ రాముడు ఎలా ఉంటాడ‌నేది థియేట‌ర్స్ లో సంక్రాంతికి తేల‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here