నోటా ప్రీ రిలీజ్ బిజినెస్.. నోట్లు చాలా రావాలి..

విజ‌య్ దేర‌వ‌కొండ సినిమా అంటే ముందు ఉండే అంచ‌నాలు వేరు.. ఇప్పుడు ఉండే అంచ‌నాలు వేరు. ఈయ‌న గీత‌గోవిందం త‌ర్వాత స్టార్ అయ్యాడు. అందుకే ఈయ‌న సినిమాపై కూడా అంచ‌నాలు మార్కెట్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న నోటా బిజినెస్ చూస్తుంటే ఎవరికైనా షాక్ త‌ప్ప‌దు.

Vijaydevarakonda Nota Movie Pre Release Business

 

తెలుగు, త‌మిళ‌నాడు క‌లిపి 25 కోట్ల‌కు పైగా బిజినెస్ చేసింది ఈ చిత్రం. ముఖ్యంగా ఒక్క తెలుగులోనే 19 కోట్ల‌కు అమ్మేసారు ఈ చిత్రాన్ని. విజ‌య్ గ‌త సినిమా గీత‌గోవిందం తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల బిజినెస్ చేసింది. ఫుల్ ర‌న్ లో ఏకంగా తెలుగు స్టేట్స్ లోనే 50 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది.

ఇక ఓవ‌రాల్ గా 67 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు నోటాపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. పైగా ఇది పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. ఈ సినిమాలో ముఖ్య‌మంత్రిగా న‌టించాడు విజ‌య్. నోటా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు విజ‌య్. అందుకే భారీగా బిజినెస్ జ‌రిగినా కూడా కూల్ గా క‌నిపిస్తున్నాడు. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. నోటా విడుద‌లైన త‌ర్వాత ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here