ప‌వ‌న్ భ‌జ‌న సంఘంలో చేరిన విజ‌య్..

టాలీవుడ్ లో అభిమాన సంఘాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ భ‌జ‌న సంఘాలు కూడా వ‌స్తుంటాయి. వాళ్లు చేసే ప‌నుల‌తోనే అవి అభిమాన‌మా.. లేదంటే భ‌జ‌నా అనేది ఇట్టే తెలిసిపోతుంది. వాళ్లు అభిమానం అని చెప్పుకుంటూనే ఆ ముసుగులో చిడ‌త‌లు వాయిస్తూ భ‌జ‌న చేస్తూనే ఉంటారు. అదేం విచిత్రమో కానీ ఇలాంటి భ‌జ‌న సంఘాలు తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఎక్కువ‌గా ఉన్నాయి. పాపం ఆయ‌న వీటిని ప‌ట్టించుకోడు కానీ వీళ్లే ఆయ‌న్ని ఎక్కువగా ప‌ట్టించుకుంటారు.

అదే ఆయ‌న ఇమేజ్ వాడుకోడానికి.. త‌మ ప‌బ్బం గ‌డుపుకోడానికి. పేర్లు ఎందుకు కానీ పేరు మోసిన హీరోలు.. ద‌ర్శ‌కులు సైతం ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ పేరు వాడేసుకుంటుంటారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం ఇదే చేస్తున్నాడేమో అనిపిస్తుంది. సొంత టాలెంట్ తోనే సూప‌ర్ స్టార్ అయిన ఈ హీరో.. ఇప్పుడు ప‌వ‌న్ అభిమాని అయిపోయాడు.

Vijay Deverakonda supports pawan kalyan
Vijay Deverakonda supports pawan kalyan

ఈయ‌న పుట్టిన‌రోజుకు ట్విట్ట‌ర్ లో శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో ఆగిపోకుండా.. త‌న సినిమా కాంపైనింగ్ మొద‌లుపెడ‌తానంటూ హింటిచ్చాడు. అంటే ప్ర‌చారం అన్న‌మాట‌.. దాన్నే ప్ర‌మోషన్ అని ఇంగ్లీష్ లో ముద్దుగా పిలుచుకుంటారు. ఈయ‌న న‌టిస్తున్న నోటా సినిమా ప్ర‌మోష‌న్ సెప్టెంబ‌ర్ 3 నుంచే మొద‌లు పెడుతున్నాడు విజ‌య్.

ఈ చిత్రం రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది కాబ‌ట్టి ప‌వ‌న్ అబిమానుల స‌పోర్ట్ కూడా ఉంటే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నాడు విజ‌య్. అస‌లే మ‌నోడు ప్ర‌మోష‌న్ కింగ్ క‌దా.. ఏ సినిమాను ఎప్పుడు ఎలా వాడుకోవాలో.. ప్ర‌మోట్ చేసుకోవాలో బాగా తెలుసు. అందుకే ఇప్పుడు టైమ్ చూసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్ కూడా వాడేస్తున్నాడు. అక్టోబ‌ర్ 4న నోటా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. మ‌రి ప‌వ‌న్ ఇమేజ్ ఈ కుర్రాడికి ఎంత‌వ‌ర‌కు యూజ్ అవుతుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here