అప్పుడే విజ‌య్ నోటా ట్రైల‌ర్ విడుద‌ల‌..

సంచ‌ల‌న విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న ద్విభాషా చిత్రం నోటా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో చేయ‌న‌టువంటి భిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మెహ్రీన్ కౌర్ ఇందులో విజ‌య్ కు జోడీగా న‌టిస్తుంది.

nota trailer release date announced
nota trailer release date announced

స‌త్య‌రాజ్, నాజ‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటా చిత్రాన్ని జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థియెట్రిక‌ల్ ట్రైల‌ర్ సెప్టెంబ‌ర్ 6.. సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అక్టోబ‌ర్ లో సినిమా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సినిమా త‌ప్ప‌కుండా త‌న కెరీర్ ని మ‌రో మ‌లుపు తిప్పుతుంద‌ని భావిస్తున్నాడు విజ‌య్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here