షాకింగ్.. నోటాకు నెగిటివ్ టాక్..

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అడ‌క్కుండానే థియేట‌ర్స్ కు వెళ్తున్నారు ప్రేక్ష‌కులు. అలాంటిది ఈయ‌న నోటాతో త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్తున్నాడు. అక్క‌డ మ‌నోడికి ఉన్న రెస్పాన్స్ చూసి అంతా షాక్ అయ్యారు కూడా. ఇక ఇప్పుడు ఈయ‌న నోటా విడుద‌ల అయింది. ఇప్ప‌టికే అక్టోబ‌ర్ 4 రాత్రి నుంచే భారీగా ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. త‌మిళ‌నాట కూడా ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

Nota-first-talk

 

అక్క‌డ కూడా భారీగానే హంగామా చేసారు విజ‌య్ అభిమానులు. ముఖ్యంగా ఈయ‌న రౌడీ సిఎంగా ఎలా చేసుంటాడా అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ ఉంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం నోటా చాలా వ‌ర‌కు డిస‌ప్పాయింట్ చేసింద‌నే అంటున్నారు.
ముఖ్యంగా సినిమాలో విష‌యం త‌క్కువ‌.. హంగామ ఎక్కువ‌గా ఉంద‌నే టాక్ వినిపిస్తుంది.

రౌడీ సిఎంగా విజ‌య్ దేవ‌ర‌కొండ అద‌ర‌గొట్టినా ఆయ‌న‌కు క‌థ కూడా స‌హ‌క‌రించాలి క‌దా.. అదే మెయిన్ మైన‌స్ గా మారింద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. సినిమాలో కొన్ని చోట్ల ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై సెటైర్లు వేసార‌ని.. ఆ త‌ర్వాత చాలా స్లోగా సినిమా న‌డిచింద‌ని అంటున్నారు. ముఖ్యంగా రొటీన్ స్క్రీన్ ప్లేతో కొంప ముంచిందంటున్నారు. ఓవ‌రాల్ గా ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న ఇమేజ్ తో సినిమా ఏదైనా సేఫ్ జోన్ కు వెళ్తుందేమో ఆశ త‌ప్ప ఊహించుకున్న దానికంటే నోటా త‌క్కువ‌గానే ఉందంటున్నారు. మ‌రి మ‌న ద‌గ్గ‌ర ప్రేక్ష‌కులు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలిక‌..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *