విజ‌య్ దేవ‌ర‌కొండ ధైర్యం అయితే అదే..

ఒక్క ఫ్లాప్ వ‌స్తేనే గుండెలు జారిపోతుంటాయి మ‌న హీరోల‌కు. స్టార్ హీరోల‌కు ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు కానీ చిన్న హీరోలు మాత్రం ఒక్క ఫ్లాప్ వ‌చ్చినా ప్లేస్ గ‌ల్లంతైపోతుంటుంది. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం నోటా అంత పెద్ద డిజాస్ట‌ర్ అయినా కూడా మ‌నోడిలో ఏ మాత్రం భ‌యం కానీ.. బెరుకు కానీ క‌నిపించ‌డం లేదు. పైగా నాకు ఫ్లాప్ వ‌చ్చింది క‌దా.. చూసి పండ‌గ చేసుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నాడు.

vijay devarakonda,vijay devarakonda next movie,vijay devarakonda latest movies

ఫ్లాప్ వ‌చ్చినా కూడా ఇంత ధైర్యంగా ఉండ‌టానికి కార‌ణం పెద్ద‌గా ఏం లేదు.. చేతిలో మ‌రో మూడు సినిమాలు ఉన్నాయి ఈ హీరోకు. ఇదే విజ‌య్ ధైర్యం. ప్ర‌స్తుతం ట్యాక్సీవాలా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.ఇది ఆడుతుందా ఆడదా అనేది ప‌క్క‌న బెడితే గీతాఆర్ట్స్, యువీ క్రియేష‌న్స్ లాంటి నిర్మాణ సంస్థ‌ల నుంచి వ‌స్తుంది ఈ చిత్రం. ఇదే సినిమాకు బ‌లం కూడా. ఇక డియ‌ర్ కామ్రేడ్ కూడా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

దానికితోడు ఇప్పుడు క్రాంతిమాధ‌వ్ సినిమాకు క‌మిట‌య్యాడు. ఈ సినిమాతో పాటు రాక్ లైన్ వెంక‌టేశ్ నిర్మాణంలో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు. ఇలా వ‌ర‌స‌గా సినిమాలు ఉన్నాయి కాబ‌ట్టే ఏ ఒక్కటి ఆడినా త‌న ఇమేజ్ మ‌ళ్లీ వెన‌క్కి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అందుకే ఇంత ధైర్యంగా క‌నిపిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఈయ‌న న‌మ్మ‌కం ఇంత బ‌లంగా ఉంది.. మ‌రి ఈయ‌న క‌మిటైన సినిమాల్లో క‌థ ఎంత బ‌లంగా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here