వాళ్లేం పాపం చేసారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..?

విజ‌య్ దేవ‌ర‌కొండ అంటేనే ఇప్పుడు బాక్సాఫీస్ కు ద‌డ‌. ఆయ‌న ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఇప్పుడు విజ‌య్ ఉన్న ప‌రిస్థితుల్లో ఆయ‌న‌తో పోటీ అంటే దానికంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. ఇప్పుడు ఈయ‌నే ఏరికోరి వెళ్లి ఇత‌ర హీరోల‌కు పోటీగా నిలుస్తున్నాడు.

VIJAY DEVARAKONDA TARGETS VISHAL RAM

ఇదే ఇప్పుడు వాళ్లకు శాపంగా మారుతుంది. విజ‌య్ లాంటి హీరోతో ఇప్పుడు పోటీ అంటే కోరి కొరివితో త‌ల గోక్కోవ‌డ‌మే. ఈయ‌న న‌టిస్తున్న నోటా సినిమా అక్టోబ‌ర్ 4న విడుద‌ల అని ముందు చెప్పారు. కానీ ఇప్పుడు ఈ తేదీ అక్టోబ‌ర్ 18కి వెళ్లిపోయింది. దాంతో అదే రోజు రావాల‌నుకున్న మ‌రో ఇద్ద‌రు హీరోల‌కు పిడి త‌ప్ప‌దు ఇప్పుడు. ఇందులో ఏదైనా నా యిష్టం అనుకునే ముఖ్య‌మంత్రిలో న‌టిస్తున్నాడు విజ‌య్. ఏం తెలియ‌కుండా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. అక్క‌డ సంచ‌ల‌నాలు సృష్టించే పాత్ర‌లో న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఈ సినిమాతోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్తున్నాడు విజ‌య్. ఎప్ప‌ట్లాగే త‌న ఆటిట్యూడ్ కు త‌గ్గ‌ట్లుగా బూతుల‌తో పాటు ముద్దులు కూడా కురిపించాడు విజ‌య్. సిఎం పాత్ర అంటేనే ఏదో తెలియ‌ని ర‌చ్చ ఉంటుంది. ఇప్పుడు విజ‌య్ కూడా మ‌రోసారి ఇదే చేస్తున్నాడు. పైగా ముద్దులు.. బూతులతో మ‌రోసారి అర్జున్ రెడ్డిని గుర్తు చేసాడు విజ‌య్. దాంతో నోటాపై అంచ‌నాలు ఆకాశానికి చేరిపోయాయి. ఈ సినిమా వ‌స్తున్న రోజే రామ్ హ‌లో గురు ప్రేమ‌కోసమే.. విశాల్ పందెంకోడి 2 కూడా రానున్నాయి. దాంతో ఈ మూడు సినిమాలు ఎలా ఉండ‌బోతున్నాయి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోరు ఎలా ఉండ‌బోతుంది అనే విష‌యంలో ఆస‌క్తి మొద‌లైంది. మ‌రి చూడాలిక‌.. నోటాతో వాళ్ల‌కు ఎలాంటి పోటు వేస్తాడో విజ‌య్..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here