మ‌రో ప్రేమ‌క‌థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

ఒక్కోసారి ఒక్క ఫ్లాప్ తోనే ద‌ర్శ‌కుడి కెరీర్ త‌ల‌కిందులు అయిపోతుంది. అనుమానం ఉంటే చాలా మంది ద‌ర్శ‌కుల‌ను చూడొచ్చు. ఇదే లిస్టులోకి క్రాంతి మాధ‌వ్ కూడా వ‌స్తాడు. ఏడాది కింది వ‌ర‌కు క్రాంతిమాధ‌వ్ పేరు వింటే మంచి చిత్రాల ద‌ర్శ‌కుడు అనే పేరు వినిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు.. సీన్ మారిపోయింది. దానికి కార‌ణం ఉంగ‌రాల రాంబాబు. ఈ సినిమా త‌ర్వాత దారి తెలియ‌ని బాట‌సారిలా మిగిలిపోయాడు క్రాంతి. ఈ ఫ్లాప్.. ఓన‌మాలు.. మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రానిరోజు తీసుకొచ్చిన గుర్తింపు మొత్తాన్ని మంట గ‌లిపేసింది. పైగా సునీల్ కెరీర్ లో అత్యంత దారుణ‌మైన ఫ్లాప్ అయిపోయింది ఉంగ‌రాల రాంబాబు.

vijay-devarakonda
ఈ చిత్రం త‌ర్వాత అస‌లు క్రాంతిమాధ‌వ్ వైపు చూడ్డానికి కూడా ఏ హీరో ఇష్ట‌ప‌డ లేదు. ఇలాంటి టైమ్ లో విజ‌య్ దేర‌వ‌కొండ‌ను ఎంచుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈ కాంబినేష‌న్ లో సినిమా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మిస్తుంది. అక్టోబ‌ర్ 18న ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క‌థ పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంద‌ని.. దీనికి విజ‌య్ అయితేనే క‌రెక్ట్ అని ఎంచుకున్నాడు క్రాంతిమాధ‌వ్. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లా డీ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో విజ‌య్ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అందుకుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here