ఈ వెంకీ మామ‌కు ఏమైంది.. ఇంకా క‌ద‌ల‌డే..?

తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్స్ హవా బాగానే న‌డుస్తుంది. క‌థ‌లు కుద‌రాలే కానీ అంతా ఇగోలు తీసి ప‌క్క‌న‌బెడుతున్నారు. ఇదే దారిలో ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, వెంక‌టేశ్ కూడా క‌లిసి న‌టించ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రూ నిజ జీవితంలో కూడా మామాఅల్లుళ్లే. ఇప్పుడు బాబీ ఈ ఇద్ద‌ర్ని క‌లిపే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

Venky Mama on the way from Punjab

ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధ‌మైపోయింది. ఆ మ‌ధ్య హ‌డావిడిగా ముహూర్తం కూడా పెట్టారు. న‌వంబ‌ర్ లోనే షూటింగ్ అన్నారు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్ డేట్ అయితే లేదు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య త‌న భార్య స‌మంతతో క‌లిసి న‌టిస్తున్న మ‌జిలి సినిమాతో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు వెంక‌టేశ్ కూడా ఎఫ్ 2తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్త‌య్యే వ‌ర‌కు వెంకీమామ‌కు మోక్షం వ‌చ్చేలా లేదు.

స‌వ్య‌సాచి.. శైల‌జారెడ్డి అల్లుడు నిరాశ‌ప‌ర‌చ‌డంతో క‌థ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. అందుకే మ‌రోసారి వెంకీ మామా క‌థపై కూర్చోవాలంటూ ద‌ర్శ‌కుడు బాబీని కోరుతున్నాడు చైతూ.. అలాగే వెంకీ కూడా అల్లుడి మాట కాద‌న‌లేక‌పోతున్నాడు. ఈ సినిమాలో కూడా ఇద్ద‌రూ మామాఅల్లుళ్లుగానే న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి వెంకీ మామా అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నాడు ద‌ర్శ‌కుడు బాబీ. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఇందులో నాగ‌చైత‌న్య‌కు జోడీగా ర‌కుల్.. వెంకీకి జోడీగా కాలా ఫేమ్ హ్యూమా ఖురేషి న‌టించ‌నున్నారు.

కానీ ఇప్ప‌ట్లో మాత్రం సినిమా ప‌ట్టాలెక్క‌డం గ‌గ‌న‌మే. క‌చ్చితంగా మ‌రికొన్ని రోజులు ప‌డుతుంది ఈ చిత్రం సెట్స్ పైకి రావ‌డానికి. పాపం అప్ప‌టి వ‌ర‌కు బాబీ వేచి చూడ‌టం త‌ప్ప ఇంకేం చేయ‌లేని ప‌రిస్థితి. జై ల‌వ‌కుశ త‌ర్వాత ఈయ‌న ఇప్ప‌టికీ ఖాళీగానే ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here