వెంకీ మామ క‌దిలాడండోయ్.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా షూటింగ్..

తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్స్ హవా బాగానే న‌డుస్తుంది. క‌థ‌లు కుద‌రాలే కానీ అంతా ఇగోలు తీసి ప‌క్క‌న‌బెడుతున్నారు. ఇదే దారిలో ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, వెంక‌టేశ్ కూడా క‌లిసి న‌టించ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రూ నిజ జీవితంలో కూడా మామాఅల్లుళ్లే. ఇప్పుడు బాబీ ఈ ఇద్ద‌ర్ని క‌లిపే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధ‌మైపోయింది. ఆ మ‌ధ్య హ‌డావిడిగా ముహూర్తం కూడా పెట్టారు.

venkatesh

న‌వంబ‌ర్ లోనే షూటింగ్ అన్నారు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్ డేట్ అయితే లేదు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య త‌న భార్య స‌మంతతో క‌లిసి న‌టిస్తున్న మ‌జిలి సినిమాతో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు వెంక‌టేశ్ కూడా ఎఫ్ 2తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో వెంక‌టేష్ ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నాడు.

స‌వ్య‌సాచి.. శైల‌జారెడ్డి అల్లుడు నిరాశ‌ప‌ర‌చ‌డంతో క‌థ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. అందుకే మ‌రోసారి వెంకీ మామా క‌థపై కూర్చోవాలంటూ ద‌ర్శ‌కుడు బాబీని కోరుతున్నాడు చైతూ.. అలాగే వెంకీ కూడా అల్లుడి మాట కాద‌న‌లేక‌పోతున్నాడు. ఈ సినిమాలో కూడా ఇద్ద‌రూ మామాఅల్లుళ్లుగానే న‌టించ‌బోతున్నారు. అందుకే ఈ చిత్రానికి వెంకీ మామా అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు ద‌ర్శ‌కుడు బాబీ. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఇందులో నాగ‌చైత‌న్య‌కు జోడీగా ర‌కుల్.. వెంకీకి జోడీగా శ్రీ‌య న‌టించ‌నున్నారు. కానీ ఇప్ప‌ట్లో నాగ‌చైత‌న్య మాత్రం షూటింగ్ కు రాడు. క‌చ్చితంగా మ‌రికొన్ని రోజులు ప‌డుతుంది ఈ చిత్రం సెట్స్ కి రావ‌డానికి. మొత్తానికి వెంకీ మామ సెట్స్ కు వెంక‌టేష్ వ‌చ్చినా చైతూ మాత్రం ఇంకా రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *