స్కూల్ కు బాంబ్ తీసుకెళ్లిన విక్ట‌రీ వెంక‌టేష్..

వెంక‌టేష్ ఏంటి.. బాంబ్ తీసుకెళ్లడం ఏంటి అనుకుంటున్నారా..? ఇది మ‌నం చెప్పిన క‌థ కాదు.. ఆయ‌నే చెప్పాడు. సాధారణంగా మ‌నం స్కూల్లో ఎగ్జామ్ రాయడానికి ఏం తీసుకెళ్తాం.. ఒక ప్యాడు.. దాంతోపాటు పెన్ను.. ఆన్సర్ తెలియకపోతే కాస్త ధైర్యం చేసి చిట్టీలు పెట్టుకొని వెళ్తాం. అంతేగాని ఎగ్జామ్ హాల్లోకి బాంబులు అయితే తీసుకెళ్ళం కదా.. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం ఇదే చేశాడు. తాను స్కూల్లో ఉన్నప్పుడు కాపీ కొట్టడానికి స్కూల్లో ఎగ్జామ్ హాల్లోకి బాంబు తీసుకెళ్లాలని చెప్పాడు వెంకటేష్. ఇది దాదాపు మూడున్నర దశాబ్దాల కింద జరిగిన కథ. అప్పట్లో వెంకటేష్ ఏడవ తరగతి చదువుతున్న రోజుల్లో.. ఓ ఎగ్జామ్ కు పింక్ బాంబు తీసుకెళ్లాన‌ని చెప్పాడు వెంకీ.

No.1 yaari Excellent promo with venkatesh and varun tej

అప్పట్లో ఆ బాంబును ప్రత్యేకంగా జపాన్ నుంచి తెప్పించాడు ఈ హీరో. ఎగ్జామ్ రాస్తున్న టైంలో అది కింద పడేసరికి క్లాస్ రూమ్ అంతా ఆ బాంబు పేలి చాలా దారుణమైన వాసన వ‌చ్చింది.. అది తట్టుకోలేక ఎగ్జామ్ హాల్ నుంచి అంతా బయటికి వచ్చారని.. అప్పుడు బయట ఉన్న ఆన్సర్లు చూసుకొని ఎంచక్కా లోపలికెళ్లి ఎగ్జామ్ మళ్లీ రాసుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నాడు వెంకటేష్. ఈ సంగతులన్నీ రానా నెంబర్ 1 యారి షోలో బయటపెట్టాడు విక్టరీ హీరో. ఈ షోకు ఎఫ్ 2 ప్రమోషన్ కోసం వ‌రుణ్ తేజ్, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో కలిసి వచ్చాడు వెంకటేష్. ఇలాంటి టాక్ షో లకు వెంకీ రావడం ఇదే తొలిసారి. షో లో ఆయన చేసిన అల్లరికి రానా, వరుణ్ తేజ్ పడి పడి నవ్వుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here