వెంకీ మామ అవుతున్నాడు.. కూతురు పెళ్లి..

సినిమాలో కాదండీ బాబూ.. నిజంగానే ఇప్పుడు వెంకీ మామ అవుతున్నాడు. ఈయ‌న త‌న కూతురుకు పెళ్లి చేయ‌బోతున్నాడు. అది కూడా ప్రేమ వివాహం అని తెలుస్తుంది. వెంక‌టేశ్ కు పెళ్లీడుకు వ‌చ్చిన కూతుళ్లు ఉన్నారు. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు.

Venkatesh Daugther Arshitha Marriage Fixed

ఇప్పుడు ఈయ‌న పెద్ద కూతురు ప్రేమ‌లో ప‌డిందని.. హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని ఆమె ప్రేమిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. ఇదే నిజం అని.. ఈ మ‌ధ్యే ఇరు కుటుంబాలు కూడా క‌లిసి మాట్లాడుకున్నాయ‌ని తెలుస్తుంది. వెంక‌టేశ్ ప్ర‌స్తుతం విదేశాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు పెద్దరికంగా వెంకీ అన్న‌య్య సురేష్ బాబు అబ్బాయి ఇంటికి వెళ్లి వివాహానికి సంబంధించి మాటామంతీ సాగించి వ‌చ్చార‌ని తెలుస్తుంది. వెంక‌టేశ్ హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత ఇక్క‌డ నిశ్చితార్థం జ‌ర‌ప‌నున్నారు.

దీనికి ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా రానున్నారు. వెంక‌టేశ్ పెద్ద కూతురు అశ్రిత ఓ ప్రొఫెషనల్ బేకర్. ఫుడ్ రంగంలో ఆమె మెలుకువ‌లు నేర్చుకుంటున్నారు. ఇన్ ఫినిటీ ప్లేటర్ పేరుతో ఇప్ప‌టికే హైదరాబాద్ లో కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేసారు. త‌మ సొంత స్టూడియో రామానాయుడు స్టూడియోస్ లోనూ ఈ స్టాల్ ఒకటి ఉంది. అశ్రిత ప్రేమించిన అబ్బాయి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామి రెడ్డి కుమారుడు.. బిజినెస్ మ్యాన్ సురేందర్ రెడ్డి మనవడు. ఈ వివాహంపై పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here