త్రివిక్ర‌మ్ నెక్ట్స్ ఏంటి.. ఆ హీరోనేనా..?

అజ్ఞాత‌వాసి త‌ర్వాత త్రివిక్ర‌మ్ పై విమ‌ర్శ‌ల వెల్లువ వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన విజ‌యాల‌న్నింటిని మ‌రిచిపోయి ఒక్క ప్లాపుతోనే ఆయ‌న్ని ఆడిపోసుకున్నారు. అందుకే ఆ క‌సితో 9 నెలల్లోనే అర‌వింద స‌మేత‌తో వ‌చ్చి హిట్ కొట్టాడు మాట‌ల మాంత్రికుడు. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ అంతా నువ్వే తోపు అంటున్నారు. అర‌వింద స‌మేత ప్ర‌స్తుతం క‌లెక్ష‌న్ల వేట సాగిస్తున్నాడు. ఈ చిత్రం వారం రోజుల్లోనే 80 కోట్ల షేర్ అందుకుంది.

allu arjun and trivikram

బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందో లేదో తెలియ‌దు కానీ క‌చ్చితంగా సేఫ్ ప్రాజెక్ట్ అయితే అవుతుంది. ద‌స‌రా హాలీడేస్ దీనికి అంత‌గా క‌లిసొచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రం త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఏం చేయ‌బోతున్నాడు అనేదిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వెంక‌టేష్ తో సినిమా అన్నాడు కానీ ఇప్పుడు అది ఉండ‌టం క‌ష్ట‌మే.

ఎందుకంటే వెంకీ ఇప్పుడు రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఎఫ్ 2 సెట్స్ పై ఉంటే.. బాబీతో చేయాల్సిన వెంకీ మామా సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీగా ఉంది. దాంతో ఈ రెండు సినిమాల త‌ర్వాత వెంకీ ఫ్రీ అవ్వ‌డు. అందుకే ఇప్పుడు ఈయ‌న చూపు బ‌న్నీ వైపు వెళ్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కూడా నాలుగు నెల‌లుగా త్రివిక్ర‌మ్ కోస‌మే ఖాళీగా ఉన్నాడ‌ని తెలుస్తుంది. నా పేరు సూర్య ఫ్లాప్ అయిన త‌ర్వాత ఏ సినిమా క‌మిట్ కాలేదు బ‌న్నీ. అది మాట‌ల మాంత్రికుడి కోస‌మే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే జులాయి.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు వ‌చ్చాయి. మ‌రి మూడోసారి ఎలాంటి సినిమాతో రాబోతున్నారో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *