దిల్ రాజు ఇంట పెళ్లి సంద‌డి.. వార‌సుడి పెళ్లి..

2017 దిల్ రాజు కు పర్సనల్ గా కలిసి రాలేదు కానీ ప్రొఫెషనల్ గా మాత్రం చాలా బాగా కలిసి వచ్చింది. ఆ ఏడాది విడుదలైన ఆరు సినిమాలు విజయం సాధించాయి. ఇక 2018 నిర్మాతగా అస్సలు కలిసిరాలేదు కానీ పర్సనల్ గా మాత్రం ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది. దిల్ రాజు సోదరుడి కుమారుడు హరీష్ రెడ్డి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్ కు మహేష్ బాబు, కొరటాల శివతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అంతా వచ్చారు. రాజకీయంగా కూడా దిల్ రాజుకు చాలా ప‌లుకుబ‌డి ఉంది. అందుకే అక్క‌డి నుంచి కూడా చాలా మంది ప్ర‌ముఖులు ఈ వేడుక‌లో కనిపించారు.

Mahesh Babu at Dil Raju Nephew Harshitha Reddy Wedding Reception
Mahesh Babu at Dil Raju Nephew Harshitha Reddy Wedding Reception

ఒక్క ముక్కలో చెప్పాలంటే దిల్ రాజు వేడుకలోనే ఇండస్ట్రీ మొత్తం కనిపించింది. అంతా క‌లిసి న‌వ దంప‌తుల‌కు త‌మ విషెస్ తెలియ‌జేసారు. ఈ మధ్య రాజ్ తరుణ్ లవర్ సినిమాతో నిర్మాతగా మారాడు వరుడు హరీష్. కొంతకాలంగా దిల్ రాజుతోనే ఉంటూ ఆయన నిర్మాణ బాధ్యతలను పంచుకుంటున్నాడు ఈయ‌న‌. లవర్ ఫ్లాప్ తర్వాత నిర్మాణానికి దూరంగా ఉంటూ.. మళ్ళీ బాబాయ్ దిల్ రాజుకు హెల్ప్ చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేశ్వర బ్యానర్ లో తెరకెక్కుతున్న ఎఫ్ 2 సినిమాతో పాటు మ‌హేష్ బాబు మహర్షి సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నాడు హరీష్ రెడ్డి.

Raashi Khanna at Dil Raju Nephew Harshitha Reddy Wedding Reception

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here