బ్ర‌హ్మి షో.. చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్..

మూడు నెలల ముందు నుంచి ప్రోమోలు.. బ్ర‌హ్మానందం లాంటి స్టార్ క‌మెడియ‌న్ స‌పోర్ట్.. గ్లామ‌ర్ కోసం తేజ‌స్వి యాంక‌రింగ్.. తెలుగులో తొలి స్టాండ‌ప్ కామెడీ షో అంటూ ప్ర‌మోష‌న్.. ఇలా ఎంత కావాలంటే అంత ప్ర‌మోట్ చేసుకున్నారు.

పైగా స్టార్ మా యాజ‌మాన్యం కూడా తెలుగు లాఫ్ట‌ర్ షో అంటూ బాగానే ప్ర‌మోట్ చేసుకున్నారు. కానీ ఎంత చేసినా కూడా ఇప్పుడు ఈ షో చాలా పెద్ద డిజాస్ట‌ర్ అయిపోయింది. క‌నీసం రేటింగ్స్ కూడా లేక చేతులెత్తేసింది. స్టార్ మా కూడా ఈ షో ఎప్పుడెప్పుడు ఆపేద్దామా అని చూస్తున్నార‌ని తెలుస్తుంది.

the great laughter challenge a disaster

బ్ర‌హ్మి స్టార్ ఇమేజ్ కూడా ఈ షోకు పెద్ద‌గా క‌లిసిరాలేదు. పైగా కూడా ఈయ‌న ఫామ్ లో లేక‌పోవ‌డంతో ఇక్క‌డ టీవీల్లోకి వ‌చ్చాడ‌నే టాక్ బ‌య‌ట కూడా స్ప్రెడ్ అయిపోయింది. అందుకే హిందీ లో వ‌ర్క‌వుట్ అయిన షో ఇక్క‌డ వ‌ర్క‌వుట్ కాలేదు.

పైగా మ‌న ద‌గ్గర జ‌బ‌ర్ద‌స్థ్ లాంటి షో చూసిన త‌ర్వాత మ‌రే కామెడీ షో కూడా చూసే ప‌రిస్థితిలో లేరు ప్రేక్ష‌కులు. మ‌ధ్య‌లోనే స్టార్ మా అలీతో చేసిన ప్రోగ్రామ్ కూడా డిజాస్ట‌ర్ అయిపోయింది. ఇప్పుడు బ్ర‌హ్మి కూడా ఇదే ప‌రిస్థితి. మ‌రి చూడాలిక‌.. లాఫ్ట‌ర్ షో ప‌రిస్థితి రాను రాను ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here