కేటీఆర్ స్పీచ్.. అప్పుడు ధృవ‌.. ఇప్పుడు విన‌య విధేయ రామ‌..

కేటీఆర్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ ఆయన గాని సినిమాల్లో ఉండే చాలా మందికి గట్టి పోటీగా నిలిచేవాడు. ఇప్పటికీ సినిమాలపై చాలా అవగాహన ఉంది ఈయ‌న‌కు. అందుకే సినిమా ఇండస్ట్రీతో ఎప్పుడు స్నేహంగా ఉంటారు కేటీఆర్. ఇప్పుడు కూడా అదే చేశాడు.

Telangana Minister KTR Speech at Vinaya Vidheya Rama Pre release Event

రామ్ చరణ్ తో తన స్నేహం ఏంటో చూపిస్తూ విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడు. అక్క‌డ కేటీఆర్ మాటలు విన్న అభిమానుల‌ను ఆకాశంలో తేలిపోయేలా చేసాయి. చిరంజీవిని కేటీఆర్ పొగిడిన తీరు అద్భుతంగా ఉంది. తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలోనే చిరంజీవి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని.. ఆయన తనకంటూ ఒక పేజీని రాసుకున్నార‌ని.. ఇలాంటి నటుడు భారతదేశంలో అందులోనూ మన తెలుగులో ఉండడం గర్వకారణం అని చెప్పాడు కేటీఆర్. స్వయంకృషితో ఎదిగిన ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడని చెప్పాడు ఈ లీడ‌ర్.

చరణ్ గురించి మాట్లాడుతూ ఆయన తనకు మంచి స్నేహితుడని అలాంటి స్నేహితుడు పిలిచినప్పుడు వేడుకకు రాకుండా ఎలా ఉంటాను అని చెప్పాడు కేటీఆర్. ధ్రువ సినిమా ఆడియో ఫంక్షన్ కు తాను వచ్చానని ఆ సినిమా హిట్ అయిందని.. ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చెప్పాడు కేటీఆర్.

దానికితోడు రంగస్థలం సినిమా చూసిన తర్వాత చరణ్ నటుడిగా ఎంత ఎదిగాడు అనేది అర్థమైందని ఇప్పుడు కూడా అదే చేస్తాడు నమ్ముతున్నట్లు చెప్పాడు ఈ లీడర్. వినయ విధ్వంస రామగా చరణ్ మారిపోయాడని సంక్రాంతికి కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెప్పాడు కేటీఆర్. దానికి తోడు చరణ్ స్పీచ్ చూస్తుంటే త్వరలోనే రాజకీయ నాయకుడిగా మారబోతున్నాడు ఏమో అనుమానం వస్తుందని చెప్పాడు తెలంగాణ మంత్రి. ఆ తర్వాత వెంటనే దానికి ఇంకా టైం ఉందిలే చరణ్ ప్రస్తుతానికి సినిమాలు చేసుకో అంటూ మాట మార్చేశారు కేటీఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *