ర‌జినీ వ‌ర్సెస్ అజిత్.. ఎందుకు ఈ పోరు..?

ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒకేరోజు పోటీ ప‌డితే క‌చ్చితంగా ఇద్ద‌రికీ న‌ష్ట‌మే. అది తెలిసి కూడా కొన్నిసార్లు ఇగోల‌కు పోయో.. లేదంటే మ‌రో డేట్ లేకో పోటీ ప‌డుతుంటారు. ఇప్పుడు ఇద్ద‌రు టాప్ హీరోల‌కు ఇలాంటి స‌మ‌స్యే వ‌చ్చింది. త‌మిళ‌నాట ఈ భారీ యుద్ధానికి రంగం సిద్ధం అవుతుంది. సంక్రాంతికి ఇద్దరు టాప్ హీరోలు పోటీకి సై అంటున్నారు. ఓ వైపు ర‌జినీ కాంత్.. మ‌రోవైపు అజిత్ నువ్వా నేనా అన్న‌ట్లు పోటీ ప‌డుతున్నారు. ఇద్ద‌రూ అగ్ర హీరోలే.. త‌మ సినిమాల‌తో రికార్డుల తాట తీసే స‌త్తా ఉన్న హీరోలే.. ఇలాంటి ఇద్ద‌రు ఒకేసారి పోటీ ప‌డితే బాక్సాఫీస్ సంగ‌తేమో కానీ నిర్మాత‌ల‌కు మాత్రం ద‌డే. ఎందుకంటే రెండూ 100 కోట్ల‌కు పైగా బిజినెస్ చేసిన సినిమాలు ఒకేసారి వ‌స్తే ఎంత‌వ‌ర‌కు త‌ట్టుకుంటుంది బాక్సాఫీస్..?

Tamil-heros-Rajinikanth-Vs-Ajith-war-Starts
స‌ంక్రాంతి అంటే పెద్ద పండ‌గే.. ఒకేసారి రెండు సినిమాలు వ‌చ్చినా కూడా త‌ట్టుకునే ఛాన్స్ ఉంటుంది కానీ కాస్త గ్యాప్ తీసుకుని వ‌స్తే ఇద్ద‌రికి మంచిది అంటున్నారు ట్రేడ్ పండితులు. పైగా ఇప్పుడు హ్యాట్రిక్ ఫ్లాపుల‌తో ర‌జినీ ఉన్నాడు.. అజిత్ కూడా వివేగంతో దెబ్బ‌తిన్నాడు. దాంతో ఇద్ద‌రికీ విజ‌యం అవ‌స‌రం అనుకుంటున్న టైమ్ లో పేట్ట‌తో ర‌జినీ.. విశ్వాసంతో అజిత్ పండ‌క్కి వ‌స్తున్నారు. మ‌రి చూడాలిక‌.. ఈ ఇద్ద‌రిలో విజ‌యం ఎవ‌ర్ని వ‌రించ‌బోతుందో..? ఏ హీరో మరోసారి నిరాశ ప‌ర‌చ‌బోతున్నాడో..? అన్న‌ట్లు అజిత్ కు పొంగ‌ల్ బాగానే క‌లిసొస్తుంది. వ‌చ్చిన చాలాసార్లు విజ‌యం వ‌చ్చింది.. మ‌రోవైపు ర‌జినీకాంత్ కు మాత్రం పండ‌గ పెద్ద‌గా క‌లిసిరాలేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here