వ‌ర్మ టీజ‌ర్.. వాళ్ల‌కు ఓకే కానీ మ‌న‌కే.

అర్జున్ రెడ్డి లాంటి సినిమాను రీమేక్ చేయ‌డం అంటే క‌త్తి మీద సామే. ఏ మాత్రం తేడా జ‌రిగినా విమ‌ర్శ‌ల జ‌డిలో మునిగిపోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు. విమ‌ర్శ‌లు వ‌చ్చినా విజ‌యం కూడా అదే రేంజ్ లో వ‌చ్చింది. అర్జున్ రెడ్డి అనేది ఇప్పుడు పేరు కాదు.. అదో బ్రాండ్ అంతే.

విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్ష‌న్ ఈ సినిమాకు ప్రాణం. యావ‌రేజ్ సినిమాల‌నే రీమేక్ చేస్తుంటారు.. మ‌రి ఇంత‌టి సంచ‌ల‌నం సృష్టించిన సినిమాను మాత్రం ఎందుకు వ‌దిలేస్తారు. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఈ సినిమాను ఇటు త‌మిళ‌.. అటు హిందీ భాష‌ల్లో రీమేక్ చేస్తున్నారు. త‌మిళ్ అర్జున్ రెడ్డిగా విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ న‌టిస్తున్నాడు.

అక్క‌డ ఈ సినిమాకు వ‌ర్మ అని పెట్టాడు ద‌ర్శ‌కుడు బాల‌. ఇప్పుడు ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత అర్జున్ రెడ్డిని బాల ఎంత గుడ్డిగా ఫాలో అయిపోయాడో అర్థం అయిపోతుంది. బాల లాంటి క్రియేటివ్ డైరెక్ట‌ర్ కూడా ఎలాంటి మార్పులు చేయ‌కుండా అర్జున్ రెడ్డిని దించేసాడు. టీజ‌ర్ లో అచ్చంగా విజ‌య్ ఆటిట్యూడ్ దించేసాడు ధృవ్. అయితే త‌న మార్క్ మిస్ కాకుండా చూసుకున్నాడు కూడా. లిప్ లాక్ సీన్స్ కూడా చంపేసాడు. ఇప్ప‌టికే దీని షూటింగ్ పూర్త‌యింది. మేఘా చౌద‌రి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. అర్జున్ రెడ్డి రెగ్యుల‌ర్ సినిమా కాదు. ఇందులో చాలా డేరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిని త‌ట్టుకుని చేస్తే ధృవ్ కు మంచి ప్లాట్ ఫాం ప‌డిన‌ట్లే. మొత్తానికి తండ్రి మాదిరే తొలి సినిమాతోనే ఛాలెంజ్ లు తీసుకుంటున్నాడు ధృవ్ కృష్ణ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here