చిరంజీవి కోరిక తీర్చింది ఎవ‌రు..?

టైటిల్ చూసి త‌ప్పుగా అనుకోవ‌ద్దే.. ఇక్క‌డ అంతా మంచే ఉంది చెడు కాదు. చిరంజీవి కోరిక అంటే మ‌రోలా ఏం లేదు.. ఆయ‌న త‌న కెరీర్ లో 150 సినిమాలు చేసినా కూడా ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ చేయ‌లేద‌నే బాధ మాత్రం ఎప్పుడూ వ్య‌క్త‌ప‌రుస్తూనే ఉండేవాడు. 12 ఏళ్ల కిందే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌నుకున్నా కూడా ఎందుకో కానీ కుద‌ర్లేదు. మ‌రోవైపు అంత బ‌డ్జెట్ తెలుగు సినిమా భ‌రిస్తుందా అనే అనుమానం కూడా చిరులో ఉండిపోయింది.

కానీ బాహుబ‌లి వ‌చ్చిన త‌ర్వాత మ‌న సినిమా ఎంత బ‌డ్జెట్ అయినా మోస్తుంద‌ని ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్. ఆ న‌మ్మ‌కంతోనే మ‌ళ్లీ ఉయ్యాల‌వాడ క‌థ‌కు మెరుగులు దిద్దాడు. ఈయ‌న కోరిక తీర్చ‌డానికి నిరంత‌రం క‌ష్ట‌ప‌డింది మాత్రం పరుచూరి బ్ర‌ద‌ర్సే.

వాళ్లే లేక‌పోయుంటే ఈ రోజు ఈ సినిమా వ‌చ్చుండేది కాదంటున్నాడు రామ్ చ‌ర‌ణ్. ముఖ్యంగా సైరా ప‌ట్టాలెక్క‌డానికి.. ఇలా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి కార‌ణమైన ప‌రుచూరి సోద‌రుల‌కు త‌న ధ‌న్య‌వాదాలు తెలిపాడు మెగా వార‌సుడు. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ అద్భుతంగా ఉంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here