సైరాను రారా అంటున్న యూర‌ప్..

అవును.. ఇప్పుడు సైరా నర‌సింహారెడ్డిని యూర‌ప్ రార‌మ్మ‌ని పిలుస్తుంది. అక్క‌డి ఆహ్వానాన్ని మెగాస్టార్ కూడా అందుకున్నారు. అందుకే దేశం తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఇప్పుడు భార‌త‌దేశం దాటేస్తున్నాడు. సెప్టెంబ‌ర్ మూడో వారంలో సైరా యూర‌ప్ షెడ్యూల్ మొద‌లు కానుంది.

అక్క‌డ లొకేష‌న్ల వేట కూడా పూర్తి చేసుకుని వ‌చ్చారు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.. సినిమాటోగ్ర‌ఫ‌ర్ ర‌త్న‌వేలు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా అక్క‌డే నెల రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. యూర‌ప్ లోని జార్జియా.. ర‌ష్యాలో కూడా యుద్ధ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌ర‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ దాటి సైరా యూనిట్ వెళ్ల‌లేదు. ఇప్పుడు ఆ అవ‌కాశం అవ‌స‌రం రెండూ ఒకేసారి వ‌చ్చాయి. మొన్న‌టి వ‌ర‌కు హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ గ్రెగ్ పావెల్ ఆధ్వ‌ర్యంలో ఫైట్ సీన్స్ కంపోజ్ చేసారు.

Sye Raa Narasimha Reddy Leaked Video

ఇక ఇప్పుడు లీ విక్ట‌ర్ ఈ చిత్రం కోసం వ‌స్తున్నాడు. హాలీవుడ్ లో ఈయ‌న స్టార్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫ‌ర్. ఫారెన్ షెడ్యూల్ లో మొత్తం ఈయ‌నే ఫైట్స్ కంపోజ్ చేయ‌బోతున్నాడు. ఈ షెడ్యూల్ లోనే కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి కూడా సైరా యూనిట్ తో జ‌త క‌ల‌వ‌నున్నాడు. ఈయ‌న కూడా యూర‌ప్ వెళ్తున్నాడు. మ‌రోవైపు చిరు కూడా 63 ఏళ్ల వ‌య‌సులోనూ అస్స‌లు త‌గ్గ‌డం లేదు.

ఈ షెడ్యూల్లో బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ పోరాడి మ‌రీ గ‌న్స్ అన్నీ దోచుకునే సీన్స్ గ‌త షెడ్యూల్లోనే ఇక ఇప్పుడు యూర‌ప్ షెడ్యూల్ ను కూడా మ‌రో స్థాయిలో ఉండాలని ప్లాన్ చేసిన సురేంద‌ర్ రెడ్డి.. అందులో మ‌రో హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ను రంగంలోకి దించాడు. డిసెంబ‌ర్ లోపు షూటింగ్ అంతా ప‌ూర్తిచేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి ఈ షెడ్యూల్ త‌ర్వాత చాలా రిలాక్స్ డ్ గా క‌నిపిస్తున్నాడు చిరంజీవి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here