కేసీఆర్ కు టాలీవుడ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు.. కృష్ణ అభినంద‌న‌లు..

తెలంగాణ‌లో మ‌రోసారి టిఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. ఇప్ప‌టికే మ్యాజికల్ ఫిగ‌ర్ 60 దాటి.. 90 వైపు ప‌రుగులు తీస్తుంది కార్. కాంగ్రెస్ లో సీనియ‌ర్ లీడ‌ర్ల సీట్లు కూడా గ‌ల్లంతైపోయాయి. ఇలాంటి స‌మ‌యంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి.. కేసీఆర్ కు రాజ‌కీయ పార్టీల నుంచే కాకుండా సినిమా వాళ్ల నుంచి కూడా అభినంద‌న‌ల వెల్లువ సాగుతుంది.

Super Star Krishna Congratulates KCR

ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ నుంచి చాలా మంది కేసీఆర్, కేటీఆర్ కు ఫోన్లు చేసి త‌మ అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నారు. ముఖ్యంగా సూప‌ర్ స్టార్ కృష్ణ అయితే ప్ర‌త్యేకంగా ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసారు. నాలుగున్న‌రేళ్ల అభివృద్ది త‌ర్వాత మ‌రోసారి కేసీఆర్ గారు అధికారంలోకి రాబోతుండ‌టం నిజంగా అభినంద‌నీయం. ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ఎన్నో ప‌థ‌కాలు అత‌న్ని జ‌నంలోకి తీసుకెళ్లాయి.

అందుకే జ‌నాలు మ‌ళ్లీ ఓట్లేసి గెలిపించుకున్నారు అని చెప్పాడు కృష్ణ‌. ఈ సంద‌ర్భంగానే ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసారు. కృష్ణ‌తో పాటు ఇంకా చాలా మంది హీరోలు.. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా కేసీఆర్ కు త‌మ అభినంద‌న‌లు తెలియ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here