సుమంత్ కు క‌లిసిరాని 2018.. మ‌రో ఫ్లాప్ ఇచ్చేసాడుగా..

అక్కినేని వారసుడికి 2018 అస్సలు కలిసి రాలేదు. రెండు సినిమాలు చేసినా కూడా ఒకటి విజయం సాధించలేదు. కొన్నేళ్లుగా కనిపించడం మానేసిన సుమంత్ 2017 లో మళ్ళీరావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించకపోయినా కూడా నటుడిగా సుమంత్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇదిచ్చిన ఉత్సాహం లోనే ఈ ఏడాది రెండు సినిమాలు చేశాడు అక్కినేని వారసుడు. సుబ్రమణ్యపురం టాక్ బాగా వచ్చినా కూడా కమర్షియల్ గా ఆడలేదు. ఇక ఇప్పుడు వచ్చిన ఇదం జగత్ కూడా ఇదే పరిస్థితి. ఈ సినిమా కూడా పర్లేదు అనే టాక్ వచ్చింది. మరి తీసిపారేసేంత‌ సినిమా అయితే కాదు అంటూ ప్రేక్షకుల కూడా ఒప్పుకున్నారు. అయితే అదేమీ చిత్రమో గాని టాక్ బాగా వచ్చిన సినిమాలను కూడా విజయం సాధించలేకపోతున్నాయి.

Sumanth Movies of 2018
Sumanth Movies of 2018

ఇదే విషయాన్ని నిర్మాత దృష్టికి తీసుకెళ్లాడు సుమంత్. కొన్ని సినిమాలు టాక్ తెచ్చుకున్నా కూడా విజయం సాధించలేదంటే వైఫల్యం నిర్మాత దగ్గర ఉంటుందని అభిప్రాయపడుతున్నారు సుమంత్. ఇప్పుడు విడుదలైన ఇదం జగత్ మొన్న.. విడుదలైన సుబ్రమణ్యపురం ఈ కారణంగానే ఫ్లాప్ అయి ఉంటాయని భావిస్తున్నాడు ఈ హీరో. ఈ రెండు సినిమాల క‌థ‌ల పరంగా మంచి సినిమాలే. కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి ఊహించినంత రెస్పాన్స్ తీసుకురాలేదు. మొత్తానికి 2018 రిక్త హస్తాలతో ముగిస్తున్నాడు అక్కినేని వారసుడు. కొత్త ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్నాడు సుమంత్. మరి ఈ సినిమా విజయం తీసుకొస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here