క‌న్ఫ‌ర్మ్.. శ్రీ‌కాంత్ అడ్డాల అక్క‌డే ఉన్నాడు..

ఒక్క సినిమా చాలు క‌దా.. కెరీర్ ముంచ‌డానికి. ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈయ‌న కెరీర్ ఇప్పుడు ఎటూ కాకుండా ఉంది. ఒకే ఒక్క సినిమా ఈయ‌న కెరీర్ ను ముంచేయ‌డం కాదు.. క‌నిపించ‌కుండా చేసింది. అదే బ్ర‌హ్మోత్స‌వం. ఈ సినిమాలో మంచి మ‌రీ ఎక్కువైపోయి డిజాస్ట‌ర్ అయిపోయింది. ఆ త‌ర్వాత క‌నిపించ‌డ‌మే మానేసాడు. ఆ మ‌ధ్య ఎప్పుడో డిజే ఆడియో వేడుక‌లో త‌న సంస్థ‌లో ప‌ని చేసిన ద‌ర్శ‌కులంద‌ర్నీ ఒకేచోట చేర్చాడు దిల్ రాజు.

srikanth addala

అప్పుడు చూసిందే ఈ ద‌ర్శ‌కున్ని.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట క‌న‌బ‌డ‌లేదు. బ్ర‌హ్మోత్స‌వం ఇచ్చిన షాక్ తో ఈయ‌న వైపు చూడ్డానికి కూడా నిర్మాత‌లు సాహ‌సించ‌డం లేదు. ఒక్క‌టి రెండు కాదు.. ఏకంగా 35 కోట్ల‌కు పైగా న‌ష్టాలు తీసుకురావ‌డంతో శ్రీ‌కాంత్ అడ్డాల‌పై న‌మ్మ‌కాల‌న్నీ పోయాయి. బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మ‌నోడు ఏ సినిమాకు కూడా క‌మిట్ కాలేదు.
ఆ మ‌ధ్య మెగా కుటుంబంలో ఉన్నాడ‌ని.. అక్క‌డ అల్లు శిరీష్ తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. గీతాఆర్ట్స్ లోనే సినిమా ఉంటుంద‌నుకున్నారు కానీ శిరీషే లేద‌ని చెప్ప‌డంతో ఆశ‌లు ఆవిరైపోయాయి.

ఇక దిల్ రాజు బ్యాన‌ర్ లోనూ సినిమా కోసం చూస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల‌. ఈయ‌న‌కు కొత్త బంగారు లోకం.. సీత‌మ్మ వాకిట్లో లాంటి సినిమాలు ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ న‌మ్మ‌కంతోనే మంచి క‌థ రాసుకొని వెళ్తే రాజుగారు ఛాన్సిస్తార‌ని న‌మ్ముతున్నాడు ఈయ‌న‌. కానీ ఆ మంచి క‌థ కుద‌ర‌డం లేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం శ‌ర్వానంద్ హీరోగానే గీతాఆర్ట్స్ లో సినిమాకు శ్రీ‌కాంత్ సై అంటున్నాడ‌ని తెలుస్తుంది. మొత్తానికి దీనిపై త్వ‌ర‌లోనే కీల‌క స‌మాచారం బ‌య‌టికి రానుంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ మంచి ద‌ర్శ‌కుడికి ఎదురు చూపులు త‌ప్ప‌వు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here