ఇంత‌కీ అది శ్రీ‌దేవి బ‌యోపిక్కా కాదా..?

కొన్ని సినిమాల పై తెలియకుండానే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రియా వారియర్ నటించిన శ్రీదేవి బంగ్లా సినిమా కూడా ఇదే లిస్టు లోకి వస్తుంది. టైటిల్లోనే శ్రీదేవి పేరు ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి ప్రేక్షకుల్లోకి వచ్చేసింది. పైగా ట్రైలర్ చూసిన తర్వాత శ్రీదేవి బయోపిక్ లా ఉండటం దీనిపై అంచనాలు పెంచింది. ఇప్పుడు ఇదే సినిమా వాళ్లకు కష్టాలు కూడా తీసుకొస్తుంది. తమ అనుమతి లేకుండా శ్రీదేవి జీవితాన్ని తెరకెక్కించాడు అంటూ శ్రీదేవి బంగ్లా దర్శకనిర్మాతలకు బోనీకపూర్ లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై దర్శకుడు మాట్లాడుతూ అసలు శ్రీదేవి బయోపిక్ అని ఎవరు చెప్పారు ఇలా అందరికీ సమాధానం చెబుతూ కూర్చోలేం కదా అంటూ కౌంటర్ వేశాడు. ఇక హీరోయిన్ ప్రియా వారియర్ కూడా ఇదే సమాధానం చెప్పింది.

Sridevi Bungalow Trailer:Click the image

sridevi Bungalow trailer
sridevi Bungalow trailer

సినిమా చూడకుండా అందులో ఎలాంటి కథ ఉంటుందో అని ముందే ఎలా ఊహిస్తారు అంటూ చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. అసలు శ్రీదేవి బయోపిక్ అని ఎవరు చెప్పారు కేవలం పేరు మాత్రం ఉంటే ఆమె బయోపిక్ అయిపోతుందా అంటూ ప్రశ్నిస్తోంది ప్రియా వారియర్. ఇందులో తన పాత్ర పేరు మాత్రమే శ్రీదేవి అని.. మిగిలిన సినిమా అంత ఎవరికి సంబంధం ఉండదని.. బాత్ టబ్ లో పడి చనిపోవడం అంటే కేవలం శ్రీదేవికి మాత్రమే జరిగింది ఇంకా ఎవరికీ జరగలేదా అంటూ ప్రశ్నిస్తుంది ప్రియా. చిత్రయూనిట్ కూడా ఈమెకు వంత పాడుతుంది. మొత్తానికి ఇప్పుడు శ్రీదేవి బంగ్లా సినిమా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *