ఎన్టీఆర్ వాచ్ అమ్మితే సినిమా తీసేయొచ్చు తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ అంటే కేవలం మనకు హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఈయన ఒక యూత్ ఐకాన్. సినిమాలతో పాటు ఇంకా చాలా విషయాల్లో ఎన్టీఆర్ మిగిలిన హీరోల కంటే ముందు ఉన్నాడు. ముఖ్యంగా ట్రెండ్ ఫాలో అవ్వడంలో ఈయనకు ఈయనే సాటి. ప్రస్తుతం రాజమౌళి తనయుడు పెళ్లి కోసం జైపూర్ వెళ్ళాడు ఎన్టీఆర్. అక్కడ ఈయన చేతికి ఉన్న వాచ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా.. కచ్చితంగా అది ప్రత్యేకమైన వాచ్. దాని విలువ తెలిస్తే గుండె ఆగిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు ఇండియాలో అతి తక్కువ మంది తో ఉన్న వాచ్ అది.

Jr-NTR-2-Crore-Watch At Rajamouli Son Wedding
Jr-NTR-2-Crore-Watch At Rajamouli Son Wedding

రిచ‌ర్డ్ మెలే మెక్ మిల‌న్ అని కంపెనీ నుంచి వచ్చిన ఈ వాచ్ విలువ అక్షరాలా రెండు కోట్ల 30 లక్షలు. వినగానే అమ్మో అనిపించే రేట్ ఇది. ఈ వాచ్ తో ఒక చిన్న బడ్జెట్ సినిమా చేయొచ్చు. వాచ్ లు.. కార్లు.. బైక్ లు.. ఈ మూడు ఎన్టీఆర్ కు పిచ్చి. అందుకే మార్కెట్లోకి కొత్త బ్రాండ్ వచ్చినా వెంట‌నే తన ఇంట్లో ఉండాల్సిందే అంటాడు జూనియర్ ఎన్టీఆర్. వాచ్ విషయంలో కూడా ఇదే చేసాడు నందమూరి వారసుడు. జైపూర్ బెట్టింగ్ లో కార్తికేయ పెళ్లి ఎంత హైలెట్ అవుతుందో.. ఎన్టీఆర్ వాచ్ కూడా అంతే ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ప్రస్తుతం ఈయన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఫిబ్రవరి నుంచి ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. రాజమౌళి కూడా తనయుడు పెళ్లి పనులన్నీ ముగించుకుని మల్టీస్టారర్తో స్టార్ బిజీ కానున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here