హిట్ కొడితే హీరో.. లేదంటే జీరో.. షారుక్ ఖాన్ కు అగ్నిప‌రీక్ష‌..

షారుక్ ఖాన్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా మాట‌లు చెప్పాలా..? ఒక‌ప్పుడు కింగ్ ఖాన్ సినిమాలు వ‌స్తున్నాయంటే ఎగ‌బ‌డి చూసే వాళ్లు ప్రేక్ష‌కులు. కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. ఈయ‌న‌కు కొన్నేళ్లుగా బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది. ఎలాంటి సినిమా చేసినా కూడా నిరాశే ఎదుర‌వుతుంది. దాంతో ఇప్పుడు ప్ర‌యోగంతో ముందుకొస్తున్నాడు షారుక్. జీరో సినిమాలో న‌టించాడు ఈ హీరో.

Shahrukh Khan Zero Movie Updates

డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం విడుద‌ల అవుతుంది. ఇందులో శ్రీ‌దేవి కూడా ఉంది. అవును న‌మ్మ‌డానికి కాస్త ఆశ్చ‌ర్యంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ విష‌యం ఇన్నాళ్లూ బ‌య‌టికి రాకుండా ద‌ర్శ‌క నిర్మాత‌లు జాగ్ర‌త్త ప‌డినా కూడా ఇప్పుడు వ‌చ్చేసింది. జీరోలో ఓ చిన్న పాట‌లో శ్రీ‌దేవి మెరిసింద‌ని తెలుస్తుంది. ఈమె స్క్రీన్ పై క‌నిపించిన చివ‌రి క్ష‌ణాలు ఇవే. దాంతో షారుక్ అభిమానుల‌తో పాటు ఇప్పుడు శ్రీ‌దేవి అభిమానులు కూడా జీరో కోసం చూస్తున్నారు. పైగా ఇప్పుడు షారుక్ వ‌ర‌స ఫ్లాపుల‌తో ఎటూ కాకుండా ఉన్నాడు.

అర్జంట్ గా ఓ హిట్ కొడితే కానీ షారుక్ ఉన్నాడ‌నే సంగ‌తి ప్రేక్ష‌కుల‌కు గుర్తు రాదు. ఎందుకంటే మ‌రోవైపు స‌ల్మాన్, అమీర్ దున్నేస్తున్నారు. ఒక‌ప్పుడు వాళ్ల‌కంటే తానే తోపు అని నిరూపించుకున్న షారుక్ ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న కెరీర్ లో ఎన్నో ర‌కాల పాత్ర‌లు ట్రై చేసాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు షారుక్. ఎవ‌రెస్ట్ అంత ఇమేజ్ ఉండి కూడా షారుక్ కొత్త క‌థ‌ల వైపు ప‌రుగులు తీస్తున్నాడు.

అనుకున్న‌దే త‌డువుగా జీరో సినిమా చేస్తున్నాడు. ఇందులో మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టించాడు. అస‌లు కింగ్ ఖాన్ లాంటి హీరో సినిమాకు జీరో అనే టైటిల్ పెట్ట‌డ‌మే కొత్త‌గా ఉంది. ఇక మ‌రుగుజ్జుగా న‌టించ‌డం మ‌రో విశేషం. త‌నూ వెడ్స్ మ‌నూ.. రాంఝ్నా లాంటి సినిమాలు చేసిన ఆనంద్ ఎల్ రాయ్ దీనికి ద‌ర్శ‌కుడు. అప్ప‌ట్లో విచిత్ర సోద‌రులు కోసం క‌మ‌ల్ ఈ త‌ర‌హా మ‌రుగుజ్జుగా న‌టించాడు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు షారుక్ ఖాన్ ఆ పాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఈక్వెష‌న్ చాలా సింపుల్. హిట్ కొడితే హీరో అవుతాడు.. ఫ్లాప్ ఇస్తే జీరో అవుతాడు. మ‌రి సీన్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *