చైతూ చెయ్యెత్తి కొడితే బాక్సాఫీస్ బ‌ద్ధ‌లేనా..?

పుర‌చేత్తో కొడితే పున‌ర్జ‌న్మ లేకుండా పోతావ్ అంటూ ఓ సినిమాలో బాల‌య్య డైలాగ్ చెప్పి ర‌చ్చ చేస్తాడు. ఇప్పుడు చైతూ ఇదే చేస్తున్నాడు. ఈయ‌న ఎడ‌మ‌చేతి నేప‌థ్యంలోనే స‌వ్య‌సాచి రెడీ అయింది. ప్ర‌స్తుతం యూ ట్యూబ్ లో ర‌చ్చ చేస్తుంది స‌వ్య‌సాచి ట్రైల‌ర్. విడుద‌లైన క్ష‌ణం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ర‌ప్ఫాడిస్తుంది ఈ ట్రైల‌ర్. మామూలుగా ఒక త‌ల్లి ర‌క్తం పంచుకుని పుడితే అన్నాద‌మ్ములు అంటారు.. అదే ఒకే ర‌క్తం.. ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు.

 Savyasachi chaithu

అలాంటి అద్భుతానికి మొద‌లుని.. క‌డ‌దాకా ఉండే క‌వచాన్ని.. ఈ స‌వ్య‌సాచిలో స‌గాన్ని.. అంటూ టీజ‌ర్ లో చెప్పిన డైలాగ్ సినిమా ఎలా ఉండ‌బోతుందో చెప్ప‌డానికి..? ఇక ఇప్పుడు ట్రైల‌ర్ లో కూడా ఇదే ర‌చ్చ జ‌రుగుతుంది. నువ్వు వాన్ని చంపాలంటే ముందు వాడి ఎడ‌మ‌చేతిని దాటాలంటూ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది.

ట్రైల‌ర్ చాలా స్టైలిష్ గా.. కొత్త‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగింది. ఇందులో చైతూ పాత్ర భార‌తంలో అర్జునుడి స్పూర్థితో తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. నిధి అగ‌ర్వాల్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. మాధ‌వ‌న్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. ట్రైల‌ర్ లో ఆయ‌న ఎంట్రీకి రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ సినిమా క‌చ్చితంగా ఈయ‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంద‌ని భావిస్తున్నాడు. తెలుగులో కూడా మాధ‌వ‌న్ కు ఈ చిత్రం త‌ర్వాత అభిమానులు రావ‌డం ఖాయం. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూకుడు మీదున్న మైత్రి మూవీ మేక‌ర్స్ స‌వ్య‌సాచిని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 2న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. చైతూ గట్టిగా చెయ్యెత్తి కొడితే బాక్సాఫీస్ బ‌ద్ధ‌లైపోయేలా క‌నిపిస్తుంది ఇప్పుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *