స‌ర్కార్ సంచ‌ల‌నం.. బాహుబ‌లి త‌ర్వాత ఇదే..

విజయ్ సినిమా అంటే ఒక‌ప్పుడు త‌మిళ‌నాట మాత్ర‌మే క్రేజ్ ఉండేది.. మార్కెట్ కూడా అక్క‌డే ఎక్కువ‌గా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ హీరో సినిమాలు తెలుగులో కూడా బాగానే ఆడుతున్నాయి. అదిరిందితో ఇక్క‌డ కూడా అకౌంట్ ఓపెన్ చేసాడు విజ‌య్. ఇక ఇదిలా ఉంటే హిందీ మార్కెట్ లో కూడా ఇప్పుడు విజ‌య్ సంచ‌ల‌నాలు సాగుతున్నాయి. అక్క‌డ ర‌జినీకాంత్ రికార్డ్ సైతం దాటేసాడు విజ‌య్. ఈయ‌న న‌టిస్తున్న స‌ర్కార్ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 6న విడుద‌ల కానుంది.

SARKARఈ చిత్ర హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ఒక‌టి రెండు కాదు ఏకంగా 24 కోట్ల‌కు వెళ్లాయి. సౌత్ ఇండ‌స్ట్రీలో బాహుబ‌లి కాకుండా ఇంత రేట్ కు వెళ్లిన సినిమా ఇదే. నాన్ బాహుబ‌లిలో త‌న క్రేజ్ తో రికార్డ్ సృష్టించాడు విజ‌య్. ఇప్పుడు స‌ర్కార్ కోసం త‌మిళ ప్రేక్ష‌కులే కాదు.. తెలుగు, హిందీలో కూడా చూస్తున్నారు. దానికి సాక్ష్య‌మే ఇప్పుడు వ‌చ్చిన రైట్స్. దీపావ‌ళికి వ‌చ్చి క‌చ్చితంగా సంచ‌ల‌నం సృష్టిస్తాన‌ని ధీమాగా చెబుతున్నాడు విజ‌య్. మ‌రి చూడాలిక‌.. స్పైడ‌ర్ తో గాడి త‌ప్పిన మురుగ‌దాస్.. విజ‌య్ సినిమాతో మ‌ళ్లీ హిట్ ఇస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here