అదిరింది.. స‌ర్కార్.. విజ‌య్ తెలుగులో పాగా..

కాలం మారిపోవ‌డం అంటే ఇదే కాబోలు. సూర్య‌, విక్ర‌మ్, అజిత్ లాంటి హీరోల‌కు తెలుగులో మార్కెట్ ఉన్న‌పుడు విజ‌య్ అంటే ఎవ‌రో కూడా ఇక్క‌డ ఆడియ‌న్స్ కు తెలియ‌దు. అస‌లు ఈయ‌న సినిమాలు వ‌స్తున్నా కూడా ప‌ట్టించుకోలేదు. త‌మిళ‌నాట ఎంత పెద్ద హీరో అయినా కూడా తెలుగు మార్కెట్ మాత్రం విజ‌య్ కు చాలా ఏళ్లుగా క‌ల‌గానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు సూర్య‌, విక్ర‌మ్ లాంటి వాళ్లు తెలుగులో ఫ్లాప‌వుతున్న టైమ్ లో విజ‌య్ రైజ్ అవుతున్నాడు. ఈయ‌న ఇక్క‌డ వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్నాడు. గ‌తేడాది అదిరింది సినిమాతో ఇక్క‌డ తొలి హిట్ కొట్టిన విజ‌య్.. ఇప్పుడు స‌ర్కార్ తో రెండో హిట్ అందుకున్నాడు.

Sarkar movie collections
Sarkar movie collections

తొలిరోజు టాక్ చూసిన త‌ర్వాత క‌నీసం 4 కోట్లైనా వ‌స్తాయా అని హేలన చేసిన వాళ్ళే ఇప్పుడు స‌ర్కార్ దూకుడు చూసి దండం పెడుతున్నారు. ఆరు రోజుల్లోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 9 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింద‌ని తెలుస్తుంది. ఈ చిత్రం తెలుగులో సేఫ్ కావాలంటే 7.5 కోట్లు రావాలి. ఇప్ప‌టికే కోటిన్న‌ర ఎక్కువ‌గా వ‌చ్చింది. అంటే విజ‌య్ మ‌రో హిట్ కొట్టేసాడ‌నే అర్థం. పైగా ఇప్పుడు స‌ర్కార్ పై ఉన్న వివాదాల దృష్ట్యా సినిమాపై మ‌రింత ఆస‌క్తి చూపిస్తున్నారు ప్రేక్ష‌కులు. దాంతో క‌చ్చితంగా స‌ర్కార్ పెద్ద విజ‌యం దిశ‌గా అడుగులేస్తుంది. మొత్తానికి ఒక‌ప్పుడు విజ‌య్ సినిమా అంటే చుల‌క‌న‌గా చూసేవాళ్లు ఇప్పుడు ఆయ‌న సినిమా వ‌స్తుంద‌టే ఆలోచ‌న‌ల‌తో చూస్తున్నారు. ఇదే క‌దా మార్పు అంటే.. అంతే మ‌రి.. కాస్త లేట్ గా అయినా విజ‌య్ కు తెలుగులో మార్కెట్ మొద‌లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here