మ‌ళ్లీ మెగా కంపౌండ్ లో సంప‌త్ నంది..?

సంప‌త్ నంది.. ఈ పేరెక్క‌డో విన్న‌ట్లుంది క‌దా..? ఫ‌స్ట్ సినిమా చిన్న హీరోతో చేసినా రెండో సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోను డైరెక్ట్ చేసాడు సంపంత్ నంది. ర‌చ్చ‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ ర‌చ్చ చేసాడు. ఈ చిత్రం బాగానే ఆడినా కూడా ఆ త‌ర్వాత ఎందుకో కానీ సంప‌త్ కెరీర్ ఎప్పుడూ ఓ దారిలో న‌డ‌వ‌లేదు.
ర‌చ్చ త‌ర్వాత గ‌బ్బ‌ర్ సింగ్ 2 అవ‌కాశం వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయింది.

దాంతో రెండేళ్ల‌కు పైగా ఖాళీగా ఉండి.. బెంగాల్ టైగ‌ర్ చేసాడుజ ఆ సినిమా కూడా యావ‌రేజ్ గానే ఆడింది. పాత రొడ్డ కొట్టుడు క‌థ‌ల్నే మ‌ళ్లీ మ‌ళ్లీ తిప్పి తీస్తున్నాడ‌నే పేరుండ‌టంతో సంప‌త్ నంది వైపు చూడ్డానికి స్టార్ హీరోలు కాస్త జంకుతున్నారు. గ‌తేడాది వ‌చ్చిన గౌత‌మ్ నందా కూడా డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో ఇప్పుడు సంప‌త్ నంది వైపు చూడ్డానికి స్టార్స్ ఎవ‌రూ పెద్ద‌గా సాహ‌సించ‌డం లేదు.

పైగా సీటీమార్ అంటూ గోపీచంద్ కోసం రాసుకున్న స్క్రిప్ట్ కూడా ఇప్పుడు ఆగిపోయేలా క‌నిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఈయ‌న చూపు మెగా కంపౌండ్ వైపు ప‌డుతుంద‌ని తెలుస్తుంది. బ‌న్నీ కోసం ఇప్ప‌టికే క‌థ సిద్ధం చేసినా కూడా ఆయ‌న మాత్రం ఎందుకో ఈ ద‌ర్శ‌కున్ని పెద్ద‌గా న‌మ్మ‌డం లేద‌ని తెలుస్తుంది. మ‌రోవైపు ఇదే కంపౌండ్ లో ఉన్న సాయిధ‌రంతేజ్ కోసం కూడా సంప‌త్ ట్రై చేస్తున్నాడు.

చ‌ర‌ణ్ తో ఛోటామేస్త్రీ అనే క‌థ సిద్ధం చేసినా కూడా అదింకా చ‌ర‌ణ్ వ‌ర‌కు వెళ్ల‌డం లేదు.. వెళ్లేలా కూడా క‌నిపించ‌డం లేదు. మొత్తానికి ఏదో ఒక‌టి చేసి మెగా కంపౌండ్ లోనే ఒక్క సినిమా కొట్టాల‌ని చూస్తున్నాడు సంప‌త్. చూడాలిక‌.. సంప‌త్ నందిని ఇప్పుడు ఆదుకునే ఆ హీరో ఎవ‌రో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here