చైతూ-స్యామ్ ఒక‌రి కోసం ఒక‌రు..!

అవును.. ఇందులో అనుమానం ఏముంది.. క‌నిపిస్తుంది క‌దా.. ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండలేరు కాబ‌ట్టే పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్క‌డ ఈ ఒక‌రికి ఒక‌రు మాత్రం వేరు. ఈ కాన్సెప్ట్ వెన‌క మ‌రొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లే అయినా కూడా దానికంటే ముందు హీరో హీరోయిన్.. ఇప్ప‌టికీ ఫామ్ లో ఉన్న వాళ్లే. పైగా వ‌ర‌స సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు స‌మంత యు ట‌ర్న్.. నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు ఒకేరోజు అంటే సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానున్నాయి.

samantha naga chaitanya uturn sailaja reddy alludu
samantha naga chaitanya uturn sailaja reddy alludu

ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌రుగుతుంది తెలుగు ఇండ‌స్ట్రీలో. హాలీడే వీకెండ్ కాబ‌ట్టి క‌చ్చితంగా ఎన్ని సినిమాలు వ‌చ్చినా ప్రేక్ష‌కులు చూస్తారనే న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దాంతో స‌మంత అదే రోజు వ‌స్తుంది. ఇదే విష‌య‌మై ఇటు స‌మంత‌.. అటు చైతూ ఇద్ద‌రూ పోరు లైట్ తీసుకున్నారు. తాను తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే వ‌చ్చి నాతోనే పోటీ ప‌డ‌తావా అంటూ స్యామ్ ఇంట్లో అరుస్తుంద‌ని చెప్పాడు చైతూ. ఆ త‌ర్వాత రెండూ రెండు డిఫెరెంట్ జోన‌ర్ సినిమాలు కాబ‌ట్టి క‌చ్చితంగా చూస్తార‌ని చైస్యామ్ ను ద‌ర్శ‌క నిర్మాత‌లు బ్రెయిన్ వాష్ చేసారు. దాంతో ఇప్పుడు యు ట‌ర్న్ కు చైతూ.. శైల‌జారెడ్డి అల్లుడుకు స‌మంత ప్ర‌మోష‌న్ చేయ‌బోతున్నారు. మొత్తానికి మ‌రి ఈ వార్ లో ఎవ‌రు ఎవ‌ర్ని గెలిపిస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here