క‌ళ్యాణి.. మెల్ల‌గా హ‌లో చెబుతుందిగా..!

కొంద‌రు హీరోయిన్ల‌కు హిట్ ఫ్లాపుల‌తో ప‌నిలేదు. వాళ్ల‌కు ఏదో అదృష్టం క‌లిసొస్తూ ఉంటుంది. ఇప్పుడు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ భామ హలో సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది. చూడ్డానికి పెద్ద‌గా అంద‌గత్తె కాక‌పోయినా క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో హ‌లో సినిమాతో ఆక‌ట్టుకుంది క‌ళ్యాణి.

ఆ సినిమా విడుద‌లైన‌పుడు ఇండ‌స్ట్రీ మొత్తం ఈ భామ గురించే మాట్లాడుకున్నారు. కానీ వ‌న్ మూవీ వండ‌ర్ లా హ‌లో త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు రెండో సినిమా అందుకుంది క‌ళ్యాణి. హ‌లోలో స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన‌ట్లు.. అందంగా న‌టించింది క‌ళ్యాణి.

త‌నకు ఇది చాలా మామూలు విష‌యం అన్న‌ట్లు క‌ళ్ళ‌తోనే ఎక్స్ ప్రెష‌న్లు ప‌లికించింది. ముఖ్యంగా అఖిల్ తో వ‌చ్చే రొమాంటిక్ సీన్స్ లోనూ క‌ళ్యాణి చాలా బాగా న‌టించింది. ఇక ఇప్పుడు శ‌ర్వానంద్ కు జోడీగా సుధీర్ వ‌ర్మ సినిమాలో న‌టిస్తుంది క‌ళ్యాణి. ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతుంది.ఇందులో కాజ‌ల్ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో సినిమాలో కూడా క‌ళ్యాణి హీరోయిన్ గా న‌టిస్తుంది. సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా వ‌స్తోన్న చిత్ర‌ల‌హ‌రిలో ఓ హీరోయిన్ గా క‌ళ్యాణిని తీసుకున్నారు. ఈ రెండు సినిమాలతో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తెలుగులో సెటిల్ అయిపోవాల‌ని చూస్తుంది. మ‌రి తెలుగులో క‌ళ్యాణి టైమ్ ఎలా ఉందో మ‌రో ఏడాదిలో తెలిసిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *