విక్ర‌మ్ మ‌ళ్లీ మునిగిపోయాడు పాపం..

ఎంత బాధ‌ప‌డితే ఏం లాభం..? అభిమానులు ఏం చేసినా.. ఎంత చేసినా దేవున్ని ప్రార్థించ‌డం వ‌ర‌కే. అస‌లు చేయాల్సిందంతా విక్ర‌మే క‌దా. ఈయ‌న కెరీర్ ఇప్పుడు ఎటు వెళ్తుందో తెలియ‌ని నావ‌లా మారిపోయింది. ఏ హీరోకైనా ఒక్క ఏడాది.. రెండేళ్లు బ్లాక్ బ‌స్ట‌ర్ లేకుండా ఉంటాడు. కానీ విక్ర‌మ్ కు మాత్రం 13 ఏళ్లుగా బ్లాక్ బ‌స్ట‌ర్ లేదు. 2005లో వ‌చ్చిన అప‌రిచితుడు త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఆ స్థాయి విజ‌యం రాలేదు.

VIKRAM

మ‌ధ్య‌లో కొన్ని సినిమాలు వ‌చ్చినా కూడా అవి యావ‌రేజ్.. హిట్ అనిపించుకున్నాయే కానీ బ్లాక్ బస్ట‌ర్ మాత్రం కాలేదు. దైవ‌తిరుమ‌గ‌న్.. ఐ.. ఇరుముగ‌న్ లాంటి సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా సేఫ్ అయ్యాయంతే. మొన్న సంక్రాంతికి స్కెచ్ సినిమాతో వ‌చ్చాడు. ఈ సినిమా కూడా అంచ‌నాలు అందుకోలేదు. విజ‌య్ చంద‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం సూర్య తాన సేరంద కూట్టం ముందు నిల‌బ‌డ‌లేక‌పోయింది.

తొలివారంలో క‌నీసం 20 కోట్లు కూడా వ‌సూలు చేయలేక‌పోయింది స్కెచ్. విక్ర‌మ్ లాంటి హీరో కూడా రొటీన్ క‌థ‌ల‌కు అల‌వాటు ప‌డ‌టం అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక ఇప్పుడు కూడా సామితో మ‌రోసారి వ‌చ్చాడు విక్ర‌మ్. ఈ సినిమా కూడా చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ వైపు ప‌రుగులు తీస్తుంది ఈ చిత్రం. హ‌రి తెర‌కెక్కించిన ఈ చిత్రం దారుణ‌మైన టాక్ తెచ్చుకుంది. అస‌లు ఇంత రొటీన్ సినిమాకు విక్ర‌మ్ ఎలా ఓకే చెప్పాడ‌బ్బా అని జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు. విక్ర‌మ్ ట్రాక్ రికార్డ్ తో ప‌నిలేకుండా సామి కోసం 40 కోట్ల‌కు పైగానే బ‌డ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఇదంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైపోయింది. ప‌రిస్థితి చూస్తుంటే సినిమాకు దారుణ‌మైన న‌ష్టాలు త‌ప్పేలా లేవు. మ‌రి ఇప్పుడు విక్ర‌మ్ కు అండ‌గా నిలిచే ఆ ద‌ర్శ‌కుడెవ‌రో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here