ప్ర‌భాస్ ను వెంటాడుతున్న చిరంజీవి..

అదేంటి.. ప్ర‌భాస్ తో చిరంజీవికి ఏంటి ప‌ని అనుకుంటున్నారా..? ఒక్క‌సారి రేస్ లోకి వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రైనా ఒక్క‌టే. ఇక్క‌డ చిన్నా పెద్ద అనే తేడా అస్స‌లు ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌భాస్, చిరంజీవి పోటీ కూడా ఇదే. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. పైగా ఇద్ద‌రూ తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలే చేస్తున్నారు. చిరంజీవి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ జీవిత చ‌రిత్ర సైరా న‌ర‌సింహారెడ్డిలో న‌టిస్తుంటే.. ప్ర‌భాస్ సాహో అంటే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో వ‌స్తున్నాడు.

Saaho and Sye Raa inspect for same release date

ఈ రెండు సినిమాల షూటింగ్ ఇప్ప‌టికే 60 శాతం పూర్తైపోయాయి. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల విడుద‌ల తేదీల‌కు క్లాష్ వ‌స్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే సాహో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ఇక ఇప్పుడు చిరు కూడా సైరాను స్వాతంత్ర్య దినోత్స‌వం రోజు విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సినిమా క‌థ అదే కాబ‌ట్టి.. దేశ‌భ‌క్తి ఉంటుంది కాబ‌ట్టి ఆ రోజు వ‌స్తే చాలా బాగుంటుంది అనేది చిరు ఆలోచ‌న‌.

మ‌రోవైపు సాహో కూడా లాంగ్ వీకెండ్ ఉంటుంది.. వ‌సూళ్లు బాగా వ‌స్తాయి కాబ‌ట్టి అదే రోజు విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు. ప్ర‌స్తుతానికి సాహో విడుద‌ల అయితే ఆగ‌స్ట్ 15 క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. ఇప్పుడు చిరు కూడా వ‌స్తున్నాడు. ఒక్క‌టి మాత్రం నిజం.. చివ‌రి వ‌ర‌కు ఇద్ద‌రూ రేస్ లో అయితే ఉండ‌రు. క‌చ్చితంగా ఎవ‌రో ఒక‌రు త్యాగం అయితే చేయాల్సిందే. మ‌రి ఆ త్యాగం చేయాల్సిన హీరో ఎవ‌రో త్వ‌ర‌లోనే తేల‌నుంది. ఆగ‌స్ట్ 15 ఎవ‌రికి సొంతం అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *