రాజ‌మౌళి సినిమాకు రెమ్యున‌రేష‌న్ లేదు..

ఇప్పుడు రాజ‌మౌళికి ఉన్న ఇమేజ్.. ఆయ‌న‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆయ‌న‌తో సినిమా అంటే నిర్మాత‌ల‌కు పండ‌గే. కానీ ఆయ‌న్ని భ‌రించ‌డం కూడా పెద్ద భార‌మే. ఎందుకంటే ఇప్పుడు ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ ఇండియాలో ఏ ద‌ర్శ‌కుడికి లేదు. ఆయ‌న ఒక్క సినిమా చేస్తే దానికి 100 కోట్ల పారితోషికం ఇచ్చినా త‌క్కువే అవుతుందేమో..? ఎందుకంటే బాహుబ‌లి అనే ఒకే ఒక్క సినిమాతో ఆయ‌న ఇండియ‌న్ వైడ్ గా నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు అయిపోయాడు.

rrr movie

అందుకే ఇప్పుడు ఈయ‌న చేస్తోన్న ఆర్ఆర్ఆర్ పై కూడా అంచ‌నాలు అలాగే ఉన్నాయి. ఈ చిత్రం 300 కోట్లతో తెర‌కెక్కుతుంది. దాన‌య్య నిర్మాత‌. అయితే ఈ చిత్రానికి ఎలాంటి రెమ్యున‌రేష‌న్స్ ఇవ్వ‌డం లేద‌ని.. కేవ‌లం లాభాల్లో వాటాలు మాత్ర‌మే తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ల‌కు పారితోషికం ఇవ్వాలంటే దాన‌య్య ఆస్తులు అమ్ముకోవాలి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల రేంజ్ బ‌ట్టి క‌నీసం 20 కోట్ల రెమ్యున‌రేషన్ ఒక్కొక్క‌రికి ఇవ్వాల్సి వ‌స్తుంది. దానికితోడు రాజామౌళికి ఎంత ఇవ్వాలో కూడా లెక్కలేయ‌లేం.

అందుకే పారితోషికం ప‌క్క‌న‌బెట్టి లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. జ‌న‌వ‌రి నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. వ‌చ్చే ఏడాది అంతా సెట్స్ పైనే ఉండే ఈ చిత్రం అన్నీ కుదిర్తే జ‌న‌వ‌రి 2020కి విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి ఈ చిత్ర రేంజ్ కూడా ఇప్పుడు దాదాపు 500 కోట్ల‌కు చేరిపోతుంది. ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి చేస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *