పాపం.. రెజీనాను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదే..!

రెజీనా.. ఈ పేరెక్క‌డో విన్న‌ట్లుంది క‌దా.. అవును అప్ప‌ట్లో తెలుగు సినిమాలు కూడా చేసిందిలే. ఎందుకో తెలియ‌దు కానీ మొద‌ట్నుంచీ రెజీనాపై పెద్ద హీరోలు చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. లేక‌పోతే మ‌రేంటి ఆమె కంటే త‌ర్వాత వ‌చ్చిన వాళ్లు కూడా స్టార్స్ అయిపోయారు కానీ రెజీనా ఇప్ప‌టికీ అలాగే ఉంది.

అంతెందుకు ఆమె ప్రాణ స్నేహితురాలు ర‌కుల్ నెంబ‌ర్ వ‌న్ కూడా అయింది. కానీ రెజీనా కెరీర్ ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే. ఈ రోజుకు కూడా స్టార్ అవ్వాల‌ని ఆరాట‌ప‌డుతూనే ఉంది కానీ కాలేదు.. కావ‌ట్లేదు.. అవుతుందో లేదో క్లారిటీ లేదు. అందం ఉంది.. అభిన‌యం ఉంది కానీ అదృష్ట‌మే లేక అక్క‌డే ఆగిపోయింది రెజీనా.

పోనీ గ్లామ‌ర్ షో ఏమైనా త‌క్కువ‌గా చేస్తుందా అంటే అదీ లేదు. న‌క్ష‌త్రంలో అయితే ర‌చ్చ ర‌చ్చ చేసింది ఈ భామ‌. ఇక మిస్ట‌ర్ చంద్ర‌మౌళి అనే త‌మిళ సినిమా కోసం అమ్మ‌డు రెచ్చిపోయిన తీరు అద్భుత‌మే. బీచ్ లో అమ్మాయిగారు బికిని వేసుకుని చేసిన ర‌చ్చ ఓ రేంజ్ లో ఉంది.

మునిగిపోతున్న కెరీర్ నావ‌ను ఒడ్డుకు చేర్చుకోడానికి అవ‌స‌ర‌మైన ప్ర‌తీ ఆయుధాన్ని వాడేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇప్పుడు ఈ భామ అస‌లు క‌నిపించ‌డ‌మే మానేసింది. పైగా బ‌రువు కూడా పెరిగిపోయి.. మ‌రీ బొద్దుగా మారిపోయింది. మ‌రి ఈ వెయిట్ తో కెరీర్ వెయిట్ ఎలా మోస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here