ర‌వితేజ మారాడా లేదా.. క‌మింగ్ సూన్..!

ఇప్పుడు ర‌వితేజ అభిమానుల్లోనే కాదు.. ప్రేక్ష‌కుల్లో కూడా ఇదే అనుమానాలు ఉన్నాయి. ఈయ‌న మ‌ళ్లీ హిట్ కొడితే చూడాల‌ని చాలా మంది చూస్తున్నారు. అయితే ఒక్క హిట్ కూడా కొట్ట‌డం లేదు మాస్ రాజా. ఎప్ప‌ట్నుంచో క‌లిసొచ్చిన మాస్ క‌థ‌లు కూడా ఇప్పుడు క‌లిసి రావ‌డం లేదు. దాంతో మ‌ళ్లీ ఎక్క‌డ మొద‌లు పెట్టాడో అక్క‌డే ఆగిపోయేలా క‌నిపిస్తున్నాడు ఈ హీరో. ఒక‌ప్పుడు ర‌వితేజపై ఇండ‌స్ట్రీలో రూమ‌ర్ ఉండేది. ఈయ‌న క‌థ విని డేట్స్ తీసుకుంటే త‌క్కువ రెమ్యున‌రేష‌న్.. క‌థ విన‌కుండా డేట్స్ ఇస్తే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడు అని.

raviteja

ఇది అప్ప‌ట్లో విని న‌వ్వుకునే వాళ్లు జ‌నాలు. ఎదుగుతున్నాడు కాబ‌ట్టి ఏడుస్తున్నారు అని స‌ర్దుకునే వాళ్లు అభిమానులు. కానీ ర‌వితేజ చేస్తోన్న సినిమాలు చూస్తుంటే ఇది నిజ‌మేనేమో అనే అనుమానం రాక‌మాన‌దు. ఒక‌ప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేస్తే అందులో క‌నీసం ఒక్క‌టైనా హిట్ అయ్యేది. మ‌రో రెండు ఫ్లాప్ అయినా ఎంట‌ర్ టైన్మెంట్ ఉండేవి. కానీ ఇప్పుడు ర‌వితేజ సినిమాల్లో అస‌లు క‌థే క‌నిపించ‌డం లేదు. ఈ ఏడాది విడుద‌లైన ట‌చ్ చేసి చూడు కానీ.. నేల‌టికెట్ లో కానీ అస‌లు క‌థ ఎక్క‌డుంది..? ఏదో హీరోయిజంతో సినిమాను న‌డిపించేయాల‌నే ఆరాటం త‌ప్ప‌. మ‌రోవైపు ఇప్పుడు ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ పై కూడా ఇండ‌స్ట్రీలో వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి.

గ‌తేడాది రాజా ది గ్రేట్ కోసం ఆయ‌న తీసుకున్న రెమ్యున‌రేష‌న్ కేవ‌లం 3 కోట్లే అని అప్ప‌ట్లో వినిపించిన వార్త‌. ఎందుకంటే అక్క‌డ ఉన్న‌ది దిల్ రాజు కాబ‌ట్టి. కానీ ట‌చ్ చేసి చూడుకు కానీ.. నేల టికెట్ కు గానీ ఈయ‌న భారీ పారితోషికం తీసుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఇక ఇప్పుడు మ‌ళ్లీ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ డ‌బ్బుల కోసం కాకుండా త‌న కెరీర్ కోసం చేసాడు ర‌వితేజ‌. క‌నీసం మైత్రి మూవీ మేక‌ర్స్ ద‌గ్గ‌ర రెమ్యున‌రేష‌న్ కూడా తీసుకోలేద‌ని.. సినిమా విడుద‌లైన త‌ర్వాత చూసుకుందాం అని చెప్పాడ‌ని తెలుస్తుంది. ఇదే కానీ నిజ‌మైతే మ‌ళ్లీ ర‌వితేజలో మార్పు వ‌చ్చిన‌ట్లే. అందుకే ఇదే సంస్థ‌లో ఒప్పుకున్న‌ తెరీ రీమేక్ కూడా క‌థ‌లో లోపాల కార‌ణంగా వ‌దిలేసాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ స్థానంలో విఐ ఆనంద్ తో సైన్స్ ఫిక్ష‌న్ సినిమాకు క‌మిట‌య్యాడు మాస్ రాజా. ఈ చిత్రంలో ఆయ‌న ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేయ‌బోతున్నాడు. న‌న్ను దోచుకుందువ‌టే ఫేమ్ న‌భా న‌టేష్ ఓ హీరోయిన్ గా ఫిక్సైపోయింది. మ‌రో హీరోయిన్ గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ ఎంపికైంది. ఇద్ద‌రి కోసం వేట సాగుతుంది. మొత్తానికి ర‌వితేజ మారాడా లేదా అనేది మ‌రికొన్ని గంట‌ల్లో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ విడుద‌లైన త‌ర్వాత తెలుస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here