సొంత ఇండ‌స్ట్రీలో ర‌ష్మిక‌కు షాక్..

ర‌ష్మిక మంద‌న్న‌ను కావాల‌నే టార్గెట్ చేస్తున్నారా.. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ఆమెపై కుట్ర జ‌రుగుతుందా..? ఏమో ఇప్పుడు ఈ భామ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది మ‌రి. మొన్న‌టి వ‌ర‌కు మింగిల్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మ‌ళ్లీ సింగిల్ అయిపోయింది. ర‌క్షిత్ శెట్టితో త‌న బంధాన్ని తెంచేసుకుంది.

rashmika mandanna

ఇదే ఇప్పుడు ఈమెకు క‌న్న‌డ‌నాట వ్య‌తిరేకంగా మారుతుందేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌న్న‌డ‌లో స్టార్ హీరోల‌తో న‌టిస్తూనే వ్రిత్ర అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కూడా సైన్ చేసింది ర‌ష్మిక‌. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది. బ‌య‌టికి వ‌చ్చేసింది.. ఇంకా చెప్పాలంటే ర‌ష్మిక‌ను బ‌య‌టికి వ‌చ్చేలా చేసారు. దాంతో ఇప్పుడు క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ఈమెపై కావాల‌నే క‌క్ష్య క‌డుతున్నారా అనే వార్త‌లు కూడా బాగానే వ‌స్తున్నాయి.

అయితే ర‌ష్మిక మాత్రం తాను పుట్టింది.. పెరిగింది అంతా క‌న్న‌డ‌లోనే.. వాటిని మాత్రం వ‌ద‌ల‌నంటుంది. ఇక ర‌క్షిత్ తో విడిపోవ‌డం అనేది ఎప్పుడూ ఒకేవైపు చూడ‌కూడ‌ద‌ని.. నాణేనికి రెండు వైపులా చూడ‌టం నేర్చుకోవాలంటుంది ర‌ష్మిక‌. ఈ ఇద్ద‌రూ విడిపోయార‌ని ర‌ష్మిక త‌ల్లే చెప్పింది. ర‌క్షిత్ కూడా క్లారిటీ ఇచ్చాడు.. ఇప్పుడు ర‌ష్మిక కూడా చెప్పేసింది. ర‌క్షిత్ తో త‌ను విడిపోవ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. నిజానికి కిరిక్ పార్టీ టైమ్ లో తాను ఇంత పెద్ద స్టార్ అవుతాన‌ని బ‌హుశా ర‌ష్మిక కూడా ఊహించి ఉండ‌దు.

ఇప్పుడు ఆమె ఎదుగుతున్న తీరు చూసి ర‌క్షిత్ శెట్టి కూడా షాక్ అవుతున్నాడు. ఇలాంటి టైమ్ లో కండీష‌న్లు పెడితే కాపురాలే అస్స‌లు నిల‌బ‌డ‌వు.. అలాంటిది జ‌స్ట్ నిశ్చితార్థం అయింది. ఎలా ఇంక ఇది నిల‌బ‌డుతుంది చెప్పండి..? అందుకే త‌న‌కు నీ బంధం వ‌ద్ద‌ని తెంచేసుకుని వ‌చ్చేసింది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం ఈమె తెలుగులో నాని దేవ‌దాస్.. విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ సినిమాల‌తో బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here