పెళ్ళైన వారం రోజుల‌కే ర‌ణ్ వీర్ సింగ్ షూటింగ్..

పెళ్లి త‌ర్వాత వారం రోజుల‌కు షూటింగ్ కు రావ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇప్పుడు ర‌న్ వీర్ సింగ్ ఇదే చేసాడు. అత‌డికి టైమ్ లేదు.. ఓ వైపు సింబా సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చేసేదేం లేక పెళ్లైన వారం రోజుల‌కే మ‌ళ్లీ మేక‌ప్ వేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు సింబా సినిమాతో వ‌స్తున్నాడు ర‌ణ్ వీర్.

Ranveer returns to work after wedding

ఇది మ‌న‌ టెంప‌ర్ సినిమాకు రీమేక్. ఎన్టీఆర్ కెరీర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా టెంప‌ర్ ది మాత్రం ప్ర‌త్యేక స్థానం. ఆ సినిమాను అలా ప‌క్క‌న కుర్చీ వేసి కూర్చోబెట్టాలంతే. ఎందుకంటే ఎన్టీఆర్ లో ఎంత పెద్ద న‌టుడు ఉన్నాడో ప్ర‌పంచానికి తెలియ‌జేసిన సినిమా అది. అంతేకాదు.. ఆ సినిమాతోనే త‌న కెరీర్ మారిపోయిందంటాడు ఎన్టీఆర్. త‌న కెరీర్ కు టెంప‌ర్ అనేది ఓ టార్చ్ లైట్ అని ఇప్ప‌టికీ చెబుతుంటాడు జూనియ‌ర్.

ఇలాంటి సినిమాను రీమేక్ చేయాలన్నా.. అందులో న‌టించాల‌న్నా ఆ హీరోకు, ద‌ర్శ‌కుడికి చాలా ద‌మ్ముండాలి. అవి త‌న‌కు ఉన్నాయంటున్నాడు రోహిత్ శెట్టి. ఎన్టీఆర్ పాత్ర‌ను మ‌రిపించ‌లేక‌పోయినా.. అలా ట్రై చేస్తానంటున్నాడు ర‌ణ్ వీర్ సింగ్. టెంప‌ర్ త‌ర్వాతే ఎన్టీఆర్ లో మార్పు వ‌చ్చింది. నాన్న‌కు ప్రేమ‌తో.. జ‌న‌తా గ్యారేజ్.. జై ల‌వ‌కుశ.. మొన్న అర‌వింద స‌మేత‌ లాంటి సినిమాలు వ‌చ్చాయి. ఇలాంటి టెంప‌ర్ హిందీ రీమేక్ లో ర‌ణ్ వీర్ సింగ్ న‌టిస్తున్నాడు.

తెలుగులో ఎంతో సీరియ‌స్ గా సాగే ఈ చిత్రాన్ని హిందీలో కామెడీ చేస్తున్నాడా అనే అనుమానం రాక మాన‌దు మేకింగ్ వీడియో కానీ ఫ‌స్ట్ లుక్ కానీ చూస్తుంటే. రోహిత్ కూడా ఈ చిత్ర థీమ్ మాత్ర‌మే తీసుకుని.. టెంప‌ర్ రీమేక్ ను పూర్తి ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తానంటున్నాడు. అలా చేస్తే సోల్ మిస్సై.. సినిమాకు ఎక్క‌డ దెబ్బ ప‌డుతుందో అని కంగారు ప‌డుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. 2018 డిసెంబ‌ర్ 28న సింబా విడుద‌ల కానుంది. చూడాలిక‌.. హిందీ టెంప‌ర్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here